కాంగ్రెస్ లో మళ్లీ కామరాజనాడార్ ఫార్ములా..? బతుకుతుందా



 సీన్ ఇక్కడ కట్ చేస్తే..1963లోనూ దాదాపు ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుందంటారు. అప్పటికి కాంగ్రెస్ అధికారం చేపట్టి 15 ఏళ్లు పూర్తైంది..చైనావార్‌లో ఓడిపోవడం..వయసు మీదపడటంతో
నెహ్రూ ప్రాభవం పార్టీలో తగ్గిపోయింది. 3 ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆచార్య కృపాలనీ..రామ్ మనోహర్ లోహియా, మిన్నూ మసానీ కాంగ్రెస్‌ అభ్యర్ధులపై గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ లీడర్లకి ఓ ఆశాకిరణంగా తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ నాడార్ కన్పించారు. అప్పుడు నాడార్ ఓ ఫార్ములా చెప్పారు

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు..కేంద్రమంత్రులు అందరూ రాజీనామా చేయాలంటూ సూచించారు. ప్రధాని నెహ్రూ కూడా వీరిలానే రాజీనామా చేద్దామనుకుంటే కామరాజ్ నాడార్  వద్దని చెప్పారట. ప్లాన్‌లో భాగంగా కేంద్రమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, జగ్జీవన్ రామ్, మొరార్జీ దేశాయ్. ముఖ్యమంత్రులు బిజూ పట్నాయక్, ఎస్కే పాటిల్, కామరాజ్ నాడార్ రాజీనామా చేసారు. ఆ తర్వాత కామరాజనాడార్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నాడారే లాల్ బహదూర్ శాస్త్రిని మంత్రివర్గంలోకి తీసుకోమని సూచించగా నెహ్రూ దానికి ఓకే చెప్పారు..పోర్ట్ ఫోలియో లేకుండా నెహ్రూ వారసుడిగా అలా..లాల్ బహదూర్ శాస్త్రికి కామరాజ నాడార్ లైన్ క్లియర్ చేశారంటారు. లేదంటే నెహ్రూ తర్వాత ప్రధాని పదవి కోసం చాలామంది ఘర్షణకి దిగి ఉండేవారని చెప్తారు.

 ఇప్పుడు సీన్ కూడా అలానే ఉంది..రాహుల్ గాంధీ కోసం 200మంది కాంగ్రెస్ లీడర్లు రిజైన్ చేయడం..రాహుల్ ని తిరిగి పదవి తీసుకోమని కోరడం 1963నాటి పరిణామాలనే గుర్తు చేస్తుందంటారు. సేమ్ టూ సేమ్ అప్పటిలానే కామరాజ్ ఫార్ములాని అనుసరిస్తే..కొత్త లీడర్ వస్తాడా..లేక రాహుల్ గాంధీనే కంటిన్యూ అవుతాడా అనేదే సస్పెన్స్‌గా మారింది.

కానీ ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే..అప్పట్లో కేంద్రంలో..చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం సాధించింది మరిప్పుడో..పాతాళానికి పడిపోయింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోవచ్చు కానీ...కామరాజ్ నాడార్‌లాంటి స్ట్రాంగ్ లీడర్ ఎవరా అని కాంగ్రెస్ కాగడా వేసుకుని వెతికినా ఇప్పుడు కన్పించడం కష్టమే..అంతెందుకు  చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు రాజకీయ వారసులను గెలిపించుకోవడం కూడా కష్టమైన నేపధ్యంలో సిడబ్ల్యూసీ భేటీ అయినా ఆ పార్టీకి లీడర్‌ని ఇస్తుందో లేదో చూడాలి

Comments