మీ బలమెంత...మాదెంత ఆగ్రహంతో ఊగిపోయిన సిఎం జగన్


అసెంబ్లీలో మొట్ట మొదటిసారిగా వాయిదా తీర్మానంపై చర్చ జరగడం విశేషం..ఐతే ఇక్కడా టిడిపి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగానికి అడ్డు తగలడం చూస్తుంటే..నిజంగానే జగన్ అన్నట్లు..చంద్రబాబుగారు ఇంకా ముఖ్యమంత్రి అనే
భ్రమలోనే ఉన్నట్లున్నారు. లేకపోతే...చంద్రబాబు..ఇతర బాబులు మాట్లాడున్నంత సేపూ వైఎస్సార్సీపీ వైపు నుంచి
ఎలాంటి అడ్డంకులు లేవు..కానీ జగన్ ఎప్పుడైతే లెక్కలు చెప్పడం ప్రారంభించారో...వెంటనే దానికి అడ్డుపుల్లలు వేయడం అసెంబ్లీలో క్లియర్ గా కన్పించింది

వాస్తవానికి చర్చలో చంద్రబాబు చేసిన ఇంగ్లిష్ తెలుగు ప్రసంగాలు( పాత కాపీలు డాక్యుమెంట్ల సహకారంతో) చూస్తే
చంద్రబాబుగారు సున్న వడ్డీ రుణాల విషయంలో చెప్పింది నిజమే అనుకుంటారు..అంత పకడ్బందీ డాక్యుమెంట్లు ఉన్నాయ్..అక్కడితే ఆగిపోతే..

కానీ ఎప్పుడైతే జగన్ తానూ డాక్యుమెంట్ల సాయంతో లెక్కలు చెప్పడం ప్రారంబించాడో..వెంటనే బాబుగారి ప్రసంగం వెనుకబడి పోయింది..చర్చలో తొలి భాగం చంద్రబాబు పాయింట్ సాధిస్తే..దాన్ని జగన్ వెంటనే తుత్తునియలు చేశాడు..ఈ దశలోనే అచ్చెనాయుడు తన వీరాలాపాలు..ఆహా ఓహోలతో ప్రతి నిమిషానికి జగన్ ని బ్లాక్ చేయడం..జగన్ కూర్చోవడం కన్పించింది..కాసేపటికే సహనం కోల్పోయిన జగన్ అసెంబ్లీలో టిడిపి బలాన్ని ఎత్తి చూపుతా ఆగ్రహం ప్రదర్శించారు..మధ్యలో స్పీకర్ చెప్పినా కూడా అచ్చెనాయుడు కూర్చోకుండా..సభలో రగడ చేయడం చూస్తే..టిడిపి టార్గెట్ ఏంటో క్లియర్..దానికి అన్యాయం జరుగుతోంది..సస్పెండ్ కావాలి..బైటికి పోయి జనం ముందు డైలాగులు వేయాలి..కానీ అసెంబ్లీ లైవ్ ఉందిగా..అంత ఈజీగా నమ్మరు కదా..అందులోనూ అన్ని ఛానళ్లలో కొన్నే ఇప్పుడు మనకి భజన చేసేవి

Comments

  1. అంత పూనకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? బలాబలాలు ఒక ground లో తేల్చుకోవచ్చు. అసెంబ్లీ లో ఎందుకు?

    ReplyDelete

Post a Comment