పవర్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయడం ఆ ఛానళ్లకి ఎందుకు నచ్చదు


పవర్ ప్రాజెక్టులతో ఒప్పందాలు రద్దు చేసుకోవడమనేది జగన్ లక్ష్యాలలో ఒకటిగా కొన్ని ఛానళ్లు..పత్రికలు రాస్తున్నాయి..అది చదివి నిజమే అనుకుంటే..చూసి వాహ్వా అనుకుంటే పప్పులో కాలేసినట్లే..ఇక్కడ అసలు  ఎందుకు ఈ జగన్‌కి ఈ తాపత్రయం..పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్ లో ఎక్కువ తక్కువలు జరిగితే ఈయనకెందుకసలు..హ్యాపీగా వాళ్ల దగ్గర్నుంచి ఏదో దండుకోవచ్చు కదా..ఈ టాక్ కూడా విన్పిస్తుంది..కానీ ఏదో ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పినందుకు ఏవో నాలుగు మంచి పనులు చేసేద్దామనే ఊపులో
వీటిలో అవకతవకలు వెలికితీసే పనిలో ఎందుకు పడడం..
ఇంకో నాలుగు అమ్మఒడికి బాబులాాంటి పథకాలు పెట్టుకుంటే సరిపోతుంది..కానీ అలా అయితే జగన్ ఎందుకు అవుతాడు..నిజానికి ఇదేం కొత్తగా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా కాదు..ఊరూరా కాలినడకన తిరుగుతున్న సమయంలోనే ఆయా ప్రాంతాలలో ఇచ్చిన మాటే ఇది..ఐతే ఇచ్చిన మాటపై నిలబడి మా పొట్ట కొడతారా..ఇదీ కంపెనీల ప్రశ్న...
కేంద్రం ఏదో ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసినట్లు..రద్దు చేయాలని ఆర్డర్స్ వేసినట్లు కొన్ని ఛానళ్లకి అన్పించవచ్చు కానీ..వాస్తవంలో కేంద్రం రాసిన లెటర్ లో ఏం ఉందంటే..అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే...పెట్టుబడిదారుల్లో నమ్మకం పోవచ్చు అనే..అంతేకానీ తక్కువకి అమ్మాల్సిన కరెంట్ ని ఎక్కువకి పెట్టి కొనుగోలు చేసి ఇల్లు గుల్ల చేసుకోమని ఎక్కడా లేదు..

మరెందుకు ఈ తాపత్రయం ఎందుకంటే...మనకి సంబంధించిన  అమ్మన్యులు అఁదులో పెట్టుబడి పెట్టారు కాబట్టి..వాళ్లే మాకు ఇంధనం సమకూర్చుతారు కాబట్టి..అందుకే ఆ ఒప్పందాలు క్యాన్సిల్ చేస్తే..మా బళ్లు లాగలేంం కాబట్టే వద్దంటున్నాం..ఇదీ బైటికి చెప్పని కోణం..సరే వాటి సంగతి మనకెందుకు కానీ..ఒప్పందాల రద్దు చట్ట విరుధ్దం ఎక్కడా కాదు..రాజ్యాంగ విరుధ్దం అంతకన్నా కాదు..దేశద్రోహం అంతకన్నాకాదు..

పవర్ ప్రాజెక్టులు ఉండటమే దేశద్రోహం అన్న రేంజ్ ‌లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చిన నేపధ్యంలో ఓ పత్రిక పెట్రేగిపోవడం చూశాం..దానికి టిడిపి లీడర్లు భజనతో పాటు చిడతలు వాయించడం చూశాం..అలా రాసిన పత్రిక ఓనర్ కి కూడా ఓ రాష్ట్రంలో పవర్ ప్లాంట్లున్నాయ్..ఇప్పుడు ఈ దూకుడు ఆ రాష్ట్రాలకు చేరితే..వాళ్లూ ఇదే బాట పడితే..వామ్మో...ఇంకేమైనా ఉందా...అఁదుకే మరి..పాత ఒప్పందాల రద్దు వద్దు అంటోందీ....

Comments

  1. రెడ్డొచ్చే మొదలాడు...సామెత విన్నారా ?

    ReplyDelete

Post a Comment