టిడిపి సెల్ఫ్ గోల్..బాబూ కంట్రోల్ తమ్ముళ్లు



అసెంబ్లీలో రంకెలు వేయడం..కేకలు పెట్టడంతోనే అంతా ఐపోదు..దానికి జనం కూడా మద్దతు ఇవ్వాలి..జనం ఇష్యూలపైనే ఇలా కేకలు వేస్తున్నారనే అభిప్రాయం కలగాలి..మరి ఇప్పుడు టిడిపి చే స్తోన్న హంగామాలో అది ఉందా..కేవలం చూశారా..మీరు మమ్మల్ని ఓడించారు ఇప్పుడేమైందో చూడండి...అన్నట్లుగా సభలో వ్యవహరిస్తే..ఎలా..


అక్టోబర్ 2017లోని ఓ పేపర్ కట్టింగ్ రామానాయుడు పట్టుకురావడం దాన్ని పట్టుకుని అదే గెజిట్..చూడండి మీ మేనిఫెస్టోలో ఏం చేసారో.చెప్పారో..అది చేయడం లేదంటూ యాగీ చేయడంతోనే సెల్ఫ్ గోల్‌కి రంగం సిధ్దం చేసుకుంది టిడిపి..దాని తర్వాతే అసలు డ్రామా మొదలైంది..అసలే గెలిచిన ఊపు..దానికి తోడు దొరికిన టిడిపి..ఇంక వైఎస్సార్సీపీ ఎందుకు ఊరుకుంటుంది..
మా మేనిఫెస్టోలో ఏం పెట్టామో చూడండి..అంటూ ఒకటికి మూడుసార్లు అసెంబ్లీ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందింది..బహుశా సభలో టిడిపి ఇలా చేయడమే వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటుందేమో..ఎస్సీ, ఎస్టీ బిసిలలో 45 ఏళ్లు దాటిన ప్రతివారికి పెన్షన్ ఇస్తామన్నారు కానీ ఇవ్వడం లేదు అనేది టిడిపి ఆరోపణ..మరి అప్పుడు అధికారంలో ఉన్న టిడిపికి ఇప్పుడు అడిగే హక్కు ఉంటుందా...ఉండదు..కానీ ఎవరు ఏదైనా అడగొచ్చు కదా..హామీ ఇచ్చారు కాబట్టి..కానీ ఇక్కడ క్లియర్ గా చెప్పింది..75వేల రూపాయల సాయం..అది కూడా ఆర్ధికంగా..దశలవారీగా..మేనిఫెస్టోలో అదే ఉంది..వీడియోల్లోనూ అదే ఉంది..

ఇంకా నయం..2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ కొన్ని హామీలు ఇచ్చాడు..వాటిని కూడా నెరవేర్చమనలేదు..అంటే...మనకి మాత్రం ఎన్నికలకు ముందే గుర్తుకురావాలి..ఇతరులకు మాత్రం గద్దె  ఎక్కీ  ఎక్కగానే నెలలోపే అన్నీ పూర్తైపోవాలి..దీన్నే కడుపాత్రం అంటుంటారు..

Comments