తడబడిన బొత్స..గుర్తు చేసిన జగన్


వైఎస్ జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులలో బొత్స కూడా ఒకరు..సీనియర్ అంటే..ఎక్కువకాలం పదవి వెలగబెట్టిన అనుకుంటే తప్పులేదు..పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సహాధ్యాయి కూడా..పెరాలసిస్ వచ్చిన తర్వాత ( ఇది జరిగి నాలుగైదేళ్లు అయిందిలెండి) ఇప్పుడిప్పుడే బొత్స సత్యనారాయణగారికి మాట కాస్త క్లారిటీగా వస్తోంది..మామూలుగానే బొత్సదంతా...హా( ..య్యాంటీ...హ్మా....టైప్ వాయిస్..అసలు ఆయన ఎవరినైనా విమర్శించినా కూడా..బాగా వింటే కానీ క్లియర్ గా ఆయన ఏమన్నదీ అర్ధం కాదు..

రైతులకు సాయం గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ..మే నుంచి సాయం చేయాల్సింది కానీ మేం ప్రభుత్వంలోకి వచ్చిందే తర్వాత అని చెప్తూ...ప్రమాణస్వీకారం చేసిన డేట్ మర్చిపోయాడాయన
వెంటనే ముఖ్యమంత్రి జగన్ మే కాదు..జూన్ 8 అంటూ చెప్పడం సభలో చాలామంది దృష్టిని ఆకర్షించింది..
ప్రొసీడింగ్స్‌ని ప్రతి క్షణం ఫాలో అవుతూ..ఏది తేడా వచ్చినా వెంటనే సర్దడం అంటే..ఏంటో జగన్‌ని చూస్తే అర్ధం అవుతుంది..ఇంత పక్కాగా ఫాలో అవుతుంటాడు కాబట్టే..టిడిపి నుంచి ఏ ఆరోపణ వచ్చినా వెంటనే తిప్పి కొట్టగలుగుతున్నారంటే అతిశయోక్తి కాదు.

.ఐనా బొత్సగారు ...ఐదేళ్ల విరామం తర్వాత మీకు కావాల్సిన మంత్రి పదవి దక్కితే..ఆ డేట్ కూడా మర్చిపోవడం ఏంటి సర్..

Comments