ఎమ్మెల్యేలను స్పీకర్ బతిమాలాడుకోవాలా...ఏంటీ దురవస్థ..


నో డౌట్..సభలో వైఎస్సార్సీపీ చెప్పిందే నడుస్తుంది..జగన్ ఏం సూచిస్తే అదే జరుగుతుంది..కానీ..అది కూడా లాజికల్‌గానే జరుగుతుంది..క్లియర్‌గా కన్పిస్తున్నాయ్. ఆ దృశ్యాలు కూడా..మరి టిడిపి మాత్రం తక్కువ తిన్నదా..
నన్ను సస్పెండ్ చేయ్..బైటికి వెళ్లి శోకండాలు పెడతా అన్నట్లుగా ఉందా పార్టీ తీరు..చివరికి జనసేన పార్టీ ఏకలింగం కూడా టిడిపిని తప్పుబట్టే స్థాయికి దిగజారిందా ఆ పార్టీ తీరు అన్నట్లుంది..

గత అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి 63మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..వారికి మైక్ ఇచ్చారా ఇవ్వలేదా అన్నది రికార్డులు చూస్తే కన్పస్తోంది..కానీ ఇప్పుడు మాత్రం టిడిపికి అందులో చంద్రబాబుకి బానే మైక్ ఇస్తున్నారు..కానీ ఇచ్చినవెంటనే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ వెంటనే  లాగేసుకుంటున్నట్లు కన్పిస్తుంది..ఐతే దీనికి దురుద్దేశాలు  ఆపాదించాల్సిన అవసరం లేదు..ఎందుకంటే..చంద్రబాబు మాట్లాడినంతసేపూ సైలెంట్ గానే సభ కన్పిస్తుంటే...అధికారపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంట్రీ చేయడానికి అచ్చోసిన అచ్చెనాయుడు..రామానాయుడు బుచ్చయ్యదొర తహతహలాడుంతుంటే...సహజంగానే మందబలం ఉన్న వైఎస్సార్సీపీకి కాలదా..

ఐతే టిడిపి నిజంగా జనం ఇష్యూలపై ఇలా రగడ చేస్తే ఖచ్చితంగా వాళ్ల మద్దతు లభించేది..కానీ ఎంతసేపూ వ్యక్తిగతమైన విమర్శలమీద ఫోకస్ పెట్టినప్పుడు ఎవరికైనా ఏంట్రా ఈ అనుభవజ్ఞులు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్పించకతప్పదు..అందులో ఇతర ఎమ్మెల్యేల టైమ్‌ని కూడా వాడేసుకుందాం అని చూస్తే..కుదరదు కదా..ఇలాంటి సిచ్యుయేషన్‌లోనే స్పీకర్..డిప్యూటీ స్పీకర్లు..పదే పదే ప్లీజ్..ప్లీజ్ అని టిడిపి వాళ్లని బతిమాలాడుకోవడం కన్పిస్తుంది..అందుకే వైఎస్సార్సీపీ సభ్యుల కంటే..స్పీకర్లే టిడిపిపై మండిపడటం కూడా విజువల్స్ లో చూస్తున్నాం..ఇలాగైతే టిడిపికి తాత్కాలిక ప్రయోజనం దక్కవచ్చేమో కానీ..ఎన్నికల లాభం సున్నానే

Comments