ఏంటీ సెక్రటరియేట్‌ కింద నిధి ఉందా.. జి బ్లాక్ లోనా మరి ఏపీకి వాటా సంగతేంటి


లంకెబిందెలు..నిధులు...ఈ రెండు పదాల గురించి విన్నప్పుడల్లా ఎక్కడలేని ఎక్సైట్ మెంట్ కలుగుతుంది..ఈ కాన్సెప్ట్‌పైనే ఎన్నో కౌబాయ్ హిట్ మూవీస్ వచ్చాయ్..అనంత పద్మనాభ స్వామి గుడి ప్రపంచం  మొత్తం పాపులరైందంటే కూడా అపారసంపద పోగేసుకోవడం వల్లనే..మరి అలాంటి నిధులు సెక్రటరియేట్ కింద ఉన్నాయంటే.. మరి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం..? ఇదే టాపిక్ నడుస్తోందట..హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీ వరకూ ..పయనీర్ అనే ఓ డైలీలో పబ్లిష్ అయిందీ స్టోరీ

నిజాం కాలంలో కట్టిన ఈ బిల్డింగ్ జి బ్లాక్ కింద చాలా సంపద దాచి పెట్టినట్లు..రేపు డెమోలిషన్ టైమ్‌లో బయట పడతాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. చార్మినార్ నుంచి గోల్కొండ కోట వరకూ సొరంగమార్గం ఉన్నట్లే ఇక్కడ కూడా ఈ మాదిరి తవ్వకాలు చేపడితే..బోలెడంత నిధి దొరుకుతుందనే టాక్ విన్పిస్తోంది..1888లో మహబూబ్ అలీ ఖాన్ అనే ఆరో నిజాం హయాంలో జి బ్లాక్ కట్టారు..ఐతే అప్పటి పేరు సర్వ హిత..సున్నం రాతి మిక్సింగ్ తో కట్టిన ఈ బిల్డింగ్ సాంస్కృతిక సంపదకిందే వస్తుంది..ఐతే కొత్త సచివాలయం కోసం కూలదోస్తామంటున్నారు..దీనిపై ఇష్యూ నడుస్తున్నా..రాామాయణంలో పిడకలవేటలగా.. ఈ నిధులు కథలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయ్.

హైదరాబాద్ రాజ్యంగా పాలన సాగించిన సమయంలో ఇక్కడనుంచే నిజాం వ్యవహారాలు నడిపించేవారట. హైదరాబాద్ ప్రధాని ఆఫీస్‌గా కూడా దీన్నే వాడేవారని చెప్తుంటారు. 1562లో నిర్మించబడిన హుసేన్ సాగర్ ఒడ్డున ( 1888లో) సర్వ హిత కట్టారు. క్లాసికల్ యూరోపియన్ స్టైల్లో లిఫ్ట్ సౌకర్యంతో కట్టిన ఈ భవంతి..అప్పటి వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. ఎన్టీఆర్ వరకూ కూడా అందరు ముఖ్యమంత్రులూ జీ బ్లాక్ నుంచే పాలన సాగించారు. ఆయన తర్వాతే సీ బ్లాక్ కి చంద్రబాబు పాలన వ్యవహారాలను మార్చారు.

ప్రస్తుతం కొత్త సచివాలయం నేపధ్యంలో వీటిని కూల్చేస్తారంటున్నారు..ఈ క్రమంలోనే గుప్తనిధుల స్టోరీ బైటికి రాగా...అప్పుడే మరి అవి దొరికితే ఏ రాష్టానికి ఎంత అనేది తేల్చాలంటూ జోకులు పేల్చుతన్నారు.  ఐతే జీ బ్లాక్ మాత్రం అటు ఏపీ కానీ..ఇటు తెలంగాణకి కానీ కేటాయించలేదు. కాబట్టి..ఇక ఎంత దొరికినా..అది వేరేవారికే తప్ప ఈ రెండు రాష్ట్రాలకు కాదు

Comments