సాక్ష్యాలతో సహా చంద్రబాబు సిధ్దం..తుత్తునియలు చేసిన జగన్


చంద్రబాబుకు ఇప్పుడు అతి పెద్ద శత్రువులు ఎవరైనా ఉన్నారంటే..అది టిడిపి సహచరులే అని చెప్పాలి..వీలైనంత తొందరగా వైఎస్సార్సీపీని కార్నర్ చేద్దాం..అనుకుంటూ..వైెఎస్సార్సీపీ మేనిఫెస్టో పట్టుకురావడం అందులో బొక్కలు వెదకడంలోనే మునిగిపోతే..అసలు సమస్యలు గాలికి పోవడం లేదా..ఇసుక పాలసీ..ఏజెన్సీలో జ్వరాలు..జనానికి విత్తనాలు అందకపోవడం వంటి ఇష్యూలపై ఏదో మాట్లాడాం అన్నట్లు మాట్లాడటమే కానీ..వాటిపైనే ఫోకస్ పెట్టి ఉంటే
జనంలో టిడిపి తమ సమస్యలపై కూడా కాస్త దృష్టి పెట్టిందనే ఒపీనియన్ కలిగేది..

అంతే కానీ హామీల గురించి ఏదో చేయలేదు..చేయలేదు అనగానే వాళ్లేదో పశ్చాత్తాపపడిపోయి టిడిపిని భుజం మీదకి ఎత్తుకుంటారనుకోవడం భ్రమ..ఇవన్నీ చేస్తానని చెప్పినవి..పైగా అవే చేస్తున్నట్లు జగన్ చెప్పేశారు..దాదాపు అన్నీ కార్యరూపం దాల్చుతున్నాయ్ కూడా..ఆటో డ్రైవర్లకి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు బడ్జెట్ పెట్టడమే అందుకు సంకేతం..ఎందుకంటే ఏదో జనంలో ఉన్నప్పుడు చెప్తాం ప్రతిదీ గుర్తుకుపెట్టుకుంటారా అన్నట్లు కాకుండా..ఆ చిన్న విషయం కూడా గుర్తుంచుకుమరీ బడ్జెట్ లో చోటు కల్పించడమే జగన్ నిశిత దృష్టికి నిదర్సనం..

ఇక ప్రస్తుతానికి వస్తే..మేనిఫెస్టోలో పెట్టారంటూ..మేనిఫెస్టోకి ఏడాది ముందే ప్రసంగంలో ఇచ్చిన హామీని ప్రస్తావించడం..75వేల రూపాయల సాయం కాదు..పెన్షన్ ఇస్తామంటూ చెప్పారనడం..ఇలా స్కూప్ ఇచ్చే జగన్ మరింత బలపడే ఛాన్స్ ఇవ్వడం..అందుకే ఆయన పేపర్ కటింగ్ ని అటెండర్  చేత పిలిపించుకుని మరీ క్లారిటీ  ఇవ్వడం సభకి వచ్చే ముందే జగన్ ఎంత హోమ్ వర్క్ చేస్తారనడానికి నిదర్శనం..

దీనికి తోడు సభలో వీడియోల ప్రదర్శన ఒకటి..అసలే జగన్ ప్రసంగం చెప్పిందే చెప్పి ఒకటికి మూడు సార్లు చెప్తాడు..వాటికి తోడు ఇప్పుడు వీడియోలు కూడా ఇన్నిసార్లు ప్లే చేయడం..బోర్ కొడుతుంది..కానీ జనంలో ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.అందుకే ప్లాన్డ్‌గానే ఇలా వ్యవహరిస్తున్నారంటున్నారు..

కానీ అటు చంద్రబాబు వైపు చూస్తే..సలహాలు సూచనలు ఇచ్చేవారు కరువయ్యారు.కనీసం ఆ ఎమ్మెల్సీ యనమలని అయినా కాస్త పట్టించుకుంటే సరిపోయేది..కానీ ఆయనేమో మండలిలో కూర్చుండిపోయారు..దీంతో సభలో చంద్రబాబుగారు ఒంటరిగా వైఎస్సార్సీపీ అస్త్రాలను నిస్సహాయంగా ఎదుర్కొంటూ గాయపడుతున్నారు

Comments