కర్నాటకంలో ట్విస్ట్..ఇక కొత్త కేబినెట్‌తో మళ్లీ సిఎం కుమారస్వామే


పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అలయన్స్ సర్కారుకి గుడ్‌బై చెప్పడంతో..తమకే ఛాన్స్ దక్కుతుందని తెగ సంబరపడిన బిజెపికి కాంగ్రెస్, జెడిఎస్ షాక్ ఇవ్వబోతున్నట్లుంది..మొత్తానికి మొత్తం మంత్రులు రాజీనామా చేయడంతో..కుమారస్వామి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఆఫర్ చేస్తోన్నట్లు తెలుస్తోంది

దీంతో పాపం ఆరోసారి బిజెపికి ఆశాభంగం తప్పనట్లుంది..ఏడాది కూడా గడవకముందే ఇన్నిసార్లు బిజెపి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ట్రై చేసి..ఫెయిలవడం..అమిత్‌షా మంత్రాంగానికి దెబ్బే అని చెప్పాలి. ఐతే ఇక్కడ ఒక్క షరతు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే..
ఈ డ్రామా అంతా ఎక్స్ సిఎం సిద్దరామయ్యే కనుక ఆడించి ఉంటే..సిఎం పీఠం ఆయనకి దక్కాల్సిందే..లేదంటే వెనక్కి తగ్గినా..ఆ రేంజ్ పితలాటకం పెట్టిన తర్వాత ఎప్పుడైనా కుమారస్వామికి ఎర్త్ పెట్టే ఛాన్స్ ఉన్నట్లే.

ఎందుకంటే 90ఏళ్ల వృధ్దుడు దేవెగౌడ..స్వయంగా సిద్దూపై  కంప్లైంట్ చేశాడంటే..ఊరికినే చేయడు కదా..పైగా కుమారస్వామి కూడా నన్ను కాంగ్రెస్ తెగ చికాకు పెడుతోందంటూ వాపోయేవాడు. నిజంగానే చిరాకు పుడితే అసెంబ్లీ రద్దు చేయండి మహా ప్రభో అని గవర్నర్ కి చెప్పేసి..చక్కా పోయినా పోతాడు..కానీ పవర్ పాలిటిక్స్‌కి అలవాటు పడ్డోడు అంత ఈజీగా వదులుకోడు కదా..

Comments