కరణం బలరాంపై ఆమంచి చెప్తోన్నదాంట్లో మంచెంత...?


అఫిడవిట్‌లో అబద్దాలు చెప్పినా..నిజాలు దాచినా...ఎలాంటి చిక్కులు ఎదురవుతాయో..ఇప్పుడిప్పుడే పొలిటీషియన్స్‌కి..వాళ్ల ద్వారా జనాలకు అర్ధం అవుతోంద..సంతానం విషయంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కొన్ని వాస్తవాలు దాచి పెట్టాడని ఆమంచి కృష్ణమోహన్ కోర్టుకెక్కడం...కెమెరాల ముందు హంగామా చేయడం చూస్తున్నాం..ఎందుకంటే..ఇది నిజమే అని రుజువు అయితే..చీరాల ఎమ్మెల్యేగా ఈయన్నే డిక్లేర్ చేస్తారు..ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్టే..కోర్టు 2018లో వైఎస్సార్సీపికి ఇచ్చింది

మడకశిర ఎమ్మెల్యేగా  కే. ఈరన్న కొన్ని వాస్తవాలు దాచి పెట్టాడని వైఎస్సార్సీపీ అభ్యర్ధి తిప్పేస్వామి రుజువు చేయడంతో కోర్టులు తిప్పేస్వామినే ఎమ్మెల్యేగా చేసాయ్..అంటే ఇప్పుడు జరిగే పరిణామం కూడా దాదాపు అదే కావచ్చనే అంచనా ఉంది..వాస్తవానికి ఓట్ల గెలుపులో కరణం బలరాం ఎమ్మెల్యేనే..కానీ మరి నిబంధనలు కూడా పాటించాలిగా..అందులో ఇప్పుడు ప్రత్యర్ది పార్టీల అభ్యర్ధుల బొక్కలన్నీ తెగ వెతికేస్తున్న సందర్భంలో సంతానం విషయంలో ఇలాంటి ముప్పు ఎదురవుతుందని ఎందుకు ఊహించలేదో...


పైగా ఆమంచి డైరక్ట్ గా ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పాడు...ఆమె కుమార్తె కూడా తన తండ్రిగా బలరాంనే చెప్తుందంటూున్నాడు..అలాంటిప్పుడు ఆ విషయం దాచి పెట్టాడని చెప్పలేం కానీ..ఈ కోణంలో డేంజర్‌ని అంచనా వేసి ఉండడు..అందుకే ఇప్పుడు కోర్టులో ఏం చెప్తాడనే అంశం చర్చకు రాకతప్పదు..కోర్టులో అంగీకరిస్తే..పదవీగండం అంగీకరించకపోతే రచ్చబండ దగ్గర పరువు పోవడం ఖాయం..ఇది తప్పా ఒప్పా అనేది పక్కనబెడితే కొంతమంది అమాయకంగా..ఇక్కడ సంతానం సంఖ్య గురించి కేసు నిలబడదని చెప్తున్నారు..కానీ బలరాం సంతానం ఎంతమందనే విషయంపై కాదు కేసు పెట్టింది..సంతానం విషయంలో అబద్దం చెప్పాడని..కాబట్టి..ఈ సూక్ష్మం గ్రహించితే..వాస్తవం అర్ధమయి..కేసు తీవ్రత తెలుస్తుంది
కొసమెరుపు ఏమిటంటే..ఇదే తరహా కేసు చినరాజప్పపై కూడా కోర్టులోపెండింగ్ లో ఉంది..

Comments