ఆహా జగన్ ఇలాంటోళ్లని కాస్త కనిపెట్టు సామీ..లేకపోతే మటాషే


మన చుట్టూ ఉన్నవాళ్లని చూసి మనమేంటో చెప్పగల స్థితిలో ..చుట్టుపక్కల ఎవరున్నదీ చూసుకోవాల్సింది మనమే..లేదంటే ఏమైతం..ఏపీలో అప్పోజిషన్ పార్టీ లీడర్ లా అవుతాం..అంటే మనం చక్కగా ఉంటే సరిపోవడం కాదు..చుట్టూ చేరినవాళ్లూ అలానే ఉండాలి..మనమూ చక్కగా ఉండాలి..అదే మనకి తెచ్చిపెట్టే పేరు..ఎప్పుడు దొరుకుతాడా...దెబ్బేసేద్దాం...అని గ్రామాల్లో పదిరూపాయలు కట్టి సభ్యత్వం తీసుకునే మనిషి తప్పు చేసినా...ఏకంగా పార్టీ ప్రెసిడెంట్‌కే అంటకట్టేద్దాం అని ఎగస్పార్టీ ఎదురు చూస్తున్నటైమ్ లో జగన్ పార్టీ ఎమ్మెల్యేనే దొరికేసాడు..


అంటే ఆయన కూడా కాదు..ఆయన కొడుకు..ట్రాఫిక్ క్లియర్ చేస్తోన్న ఎస్సైలపైకి దూసుకెళ్లడం..కాళ్లతో తన్నడం చూస్తుంటే..అసలు ఈ పొలిటీషియన్లంటే ఏదో ఊడబొడవడానికి పై నుంచి దిగొచ్చారు..ఎవరేం చేసినా జనం పడుండాలని అనుకుంటారేమో..ఇలాంటివి చూసేకదా..ఆ బొ..సీనుగాళ్లు...వెనాయక్ గాళ్లు పొలిటీషియన్లనే రౌడీలుగా చూపించేది.. సరే పుత్రరత్నం నిర్వాకం అలా ఉంటే...ఇక ఎమ్మెల్యేగారి భార్యామణి బాఘోతం మరీ మించిపోయుంది..ఆమె వచ్చి ఆడకూతురు చేయి పట్టుకున్నారని కేసు పెడుతుందట..కేసీఆర్ సస్పెండ్ చేయిస్తాడట..ఇంతకన్నా కామెడీ ఉందా...మనమేం చేస్తున్నామో వంటిపై స్పృహ ఉంటే ఏం మాట్లాడుతున్నామో...తెలిసేది...అక్కడికేదో నా కొడుకునే  అరెస్ట్ చేస్తారా అంట..అసలు మీ కొడుకు కాబట్టే..ఇలా అరెస్ట్ మాత్రమే చేసారు..అదే మామూలు పబ్లిక్ అయితే..ఈపాటికి పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్ ఫ్రీగా ఇచ్చేసేవాళ్లు ...కాళ్లూ చేతులూ హూనమై బైటికి వచ్చేవాళ్లు..అసలు ఎమ్మెల్యే కొడుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తే కానీ..మిగిలినవాళ్లకి బుద్ది రాదు


అందుకే ఇలాంటి వాటికి జగన్ మద్దతు ఇవ్వకపోయినా...వాటిపై పబ్లిక్కా ఓ స్టేట్ మెంట్ ఇవ్వాలి..ఇదేంటిలా చేస్తున్నారు..తప్పు అని..కానీ ఆయనకి అంత మేనేజ్ మెంట్ తెలిస్తే ఎలా..అదే చంద్రబాబు అయితే ఈపాటికి మా ఎమ్మెల్యే బంధువుల ప్రవర్తన తప్పు అంటూ ఖండించినట్లు స్క్రోలింగ్స్ వేయించేవాళ్లు కదా..అదే భజనలో పరిపూర్ణత్వానికి..సాక్షి మార్క్ మొక్కుబడి రాతలకు తేడా

Comments