వరదలను దారి మళ్లించారా..ఆహా అలా అయితే సన్మానం చేయాల్సిందే.కాస్త బుర్రకి పదును పెట్టండి సర్


చంద్రబాబుగారి నివాసాన్ని ముంచేందుకు వరదలను దారి మళ్లించారట..ఆహా..వింటుంటే ఎంత సొంపుగా ఉందో
నిజంగా అంత ఘనులే అయితే..ఇక దేశంలో ఏ ప్రాంతానికి వరద ముప్పు లేకుండా ఓ నాలుగు పడవలు అడ్డం పెట్టి చేయవచ్చేమో..అసలు ఇలాంటి కుట్రకోణం బైటికి తెస్తారని శుక్రవారం ఉదయం నుంచే ఓ  పెద్ద జోక్ సర్క్యులేట్ అవుతోంది..
శ్రీశైలం డ్యామ్ దగ్గర నీటిలో ఓ 250మంది పులివెందుల గూండాలు( ఇలా మాట్లాడటం పచ్చ బ్యాచ్ కే చెల్లు) దిగారుట..దిగి నీటిని గట్టిగా చంద్రబాబుగారి నివాసంవైపు తోశారట..వెంటనే వరదనీళ్లు కూడా వాళ్లు చెప్పినవైపుకే తరలివెళ్లి డీల్ ఓకే చేశాయట..ఎలా ఉందీ వాదన..ఇంతకంటే భిన్నంగా ఏమైనా ఉందా ట్విట్టర్ పిట్ట పురాణం
పురాణం అంటే గుర్తొస్తుంది..గరుడ పురాణం శివాజీ ఉంటే ఇంకా వైట్ బోర్డ్ మీద సిత్రాలు గీసి మరీ సూపెట్టేవాడేమో

ట్విట్టర్ సింహగారు..ఇలా మా బాబు ఇల్లు ముంచే కుట్ర అని కూసిన కాసేపటికే..అబ్బెబ్బే..అసలు మా ఇల్లు మునిగిపోలేదంటూ మరో ట్వీట్ రెడీ..ఇంతకీ ఏంటి ఈ తపన అంటే..కరకట్ట మీద ఇల్లు మేం ఖాళీ చేయం..వరదలు రావు..వచ్చినా అది కుట్రతోనే వస్తాయి..అని చెప్పడమేనా..ఇంతదానికి ఇన్ని ట్వీట్లు..ఇన్ని పైట్లు ఎందుకు నాయనా..అదేదో ఓ ప్రకటన చేస్తే పోలా...

ఇది సరిపోదన్నట్లు ఓ మేధావి అంటాడు..అసలు వరద వస్తే వెంటనే నీళ్లు వెంటనే కిందకు వదలాలి కదా..అంట..నీ..పరిజ్ఞానం ..నీ జ్ఞానం...ఎన్ని క్యూసెక్కుల నీళ్లు వస్తే వరదనీళ్లుగా అనుకుని కిందకు వదలుతారో తెలీదా..పైగా వచ్చిన నీరు వచ్చినట్లు వదిలితే మీ బాబు ఇల్లు సేఫా..లేకపోతే మునగదా..ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు..ఐనా మెడకాయ మీద తలకాయ్ ఉన్న ఎవడూ  ఇలా నీళ్లు వచ్చీ రాగానే..పోమ్మా పో అంటూ కిందికి వదిలేస్తాడా..అంటే రేపు సాగర్ నుంచి నీళ్లు వచ్చినా తెలంగాణ ఇదే చేయాలా...అన్నీ చివరికి సముద్రంవైపే వెళ్లాలన్నమాట..ఆ వెళ్లే క్రమంలో కూడా కరకట్టపై నుంచి మాత్రం పోవద్దట..చెప్పండి సర్ మనం ఏ స్కూల్లో చదువుకున్నామో అందరినీ అక్కడికే పంపిస్తారు

Comments

  1. నాటు తెప్పలతో నీళ్లు మళ్ళించగలిగితే వేలాది కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టడం ఎందుకో ఏమో? ఇదేమన్నా బాలా మాయ్య సినిమా అనుకున్నాడేమో అమెరికా డొనేషన్ చదువుల ట్విట్టర్ పక్షి.

    ReplyDelete

Post a Comment