అసలు వరదలు రానే రావా..! మరిదేంటి బాబూ..!



కరకట్టపై నేనుండేది నా సొంతానిది కాదు..అద్దెకుంటున్నా..
అసలు గత పదేళ్లు..ఇరవైఏళ్లు...అనుకుంటూ గతంలో ఎప్పుడూ వరదలు రానే రావంటూ బుకాయించిన వైనం
 ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని మరీ కట్టుకున్న ఇల్లు..అంటూ ఎన్ని చెప్తేనేం ఇప్పుడు ఓపెన్‌గా తెలిసిపోయింది..వరదలు అంటూ వస్తే..అదెవరి ఇల్లైనా మునగాల్సిందే( ఆ పరివాహక ప్రాంతంలో ఉంటే) అందుకే ఇప్పుడు కరకట్ట ఆక్రమణల విషయంలో చంద్రబాబుగారి వాదనకి బలం లేకుండా పోయింది..

వరదలు రానే రావు అనే కామెంట్ కి ఇప్పుడు వచ్చిన నీటిని చూసి..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..ప్రకృతి ఎప్పుడు ఎలా బీభత్సం సృష్టిస్తుందో ఎవరికి తెలుసు..ఐతే వందిమాగధుల చానళ్లలో అంతేవాసులకనుగుణంగా చర్చలు చేసిన నోళ్లు ఇప్పుడెలా సమర్ధించుకుంటాయ్..చట్టాలనేవి డైనమిక్ గా ఉండాలి..ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి..పాత చట్టాలను పట్టుకుని వేళ్లాడితే ఎలా..తాజ్ మహల్‌ని పడేస్తారా...చార్మినార్ ని ఏం చేస్తారో..అంటూ సైటెర్లు..ట్వీట్లు చేసినోళ్లు మరిప్పుడు కరకట్టపైకి దూకిన వరదలపై ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి

ఆక్రమణల విషయంలో ఎవరినీ వదిలి పెట్టకూడదని చాలామంది అంటుంటారు..ఐతే మరి దానికి ముందుగా మన కంటి ముందు కన్పించే అనుభవజ్ఞులు దాన్ని పాటించాలి కదా..అందుకే ఆట్నుంచి నరుక్కురమ్మన్నారట..ఐనా సరే ఎటునుంచి నరుక్కొచ్చినా...ఒరిగిన ప్రయోజనం ఏం లేదు..సో..ఇక మకాం మార్చాల్సిందే..

Comments