వరద రాజకీయం...కాస్త గౌరవం పోగొట్టుకోవద్దు సామీ


నా ఇంటిని ముంచేయడం కోసం పేదప్రజలను ముంచుతారా...
అబ్బా...ఏం డైలాగ్ ఇది అనుకోవచ్చు..ఈ డైలాగ్ చూస్తూనే ఇదెవరు వేసారో కూడా అర్ధమైపోతుంది..ఇన్నాళ్ల రాజకీయం తర్వాత కూడా ఇంతగా దిగజారవచ్చా అని ఈ లీడర్ ని చూస్తే అనబుద్దవుతుంది..వరదలను కరకట్టపై ఉన్న చంద్రబాబుగారి రెెంటెడ్(అద్దె)ఇల్లును ముంచేసేందుకు పంపించారంటూ కామెంట్లు ఎవడో  సందులో శరభయ్య..గొందిలో గురవయ్య అన్నాడంటే అర్ధం చేసుకోవచ్చు..ఏకంగా ఆయనే ఇలా మాట్లాడుతున్నాడంటే ఏమనుకోవాలి..గౌరవం తనంతట తానే తీసుకుంటున్నాడుకోవడం తప్ప

పైగా వరదలు వచ్చినప్పుడే టిడిపి లీడర్లు ఇలాంటి కుట్ర కోణం అంటూ రాగాలు ఆలాపిస్తారంటూ అంచనాలు కూడా జనంల ో సర్క్యులేట్ అవడం చూస్తంటే...40ఏళ్ల రాజకీయపుటెత్తులు సామాన్యుడికి కూడా ఎలా ఎంత ఈజీగా అందుతున్నాయో తెలీడం లేదా

అసలు ఇందులో కుట్ర కోణం బైటికి తీయడంలోనే పెద్ద కుట్ర ఉంది..ఎందుకంటే..వరద వచ్చిన రోజే ఈ మాట  అని ఉంటే..వెంటనే కనీసం 0.009శాతమైనా నమ్మేవారు..ఏదో పని ఉందంటూ హైదరాబాద్ వచ్చి..తీరా రెండు రోజుల తర్వాత నా ఇంటిపైన డ్రోన్ ఎగిరింది..ఎందుకిది అంటూ నానా హడావుడి చేయడమే కానీ..ఏంటి సార్ డ్రోన్ ఎగిరితే..ప్రతిపక్షనేతగా జగన్ అమరావతి వచ్చి ఒక్క రోజు కూాడ ఎందుకు గడపలేదో తెలుసుగా...సార్..ఫోన్ ట్యాపింగ్ సార్ ట్యాపింగ్..మరి అప్పుడు లేని భద్రతా కోణం ఇప్పుడెందుకు వచ్చింది..పైగా మీ ఇఁటిపైన డ్రోన్ కాదు..వరదల ప్రాంతాలలో డ్రోన్ ఎగిరింది..దాంతో ఇదమిద్దంగా మీకు వచ్చిన నష్టమేంటో చెప్పండి నమ్ముతారు..చెప్పలేరు..మీరు ఎందుకంటే అందులో ఏం లేదు కాబట్టి లేకపోతే..డ్రోన్ ఎగరడమేంటి..వెంటనే వాళ్లని పట్టుకోవడం ఏంటి..పట్టుకుని కొట్టడం ఏంటి..ఇది కాదా బురద రాజకీయం...

Comments