ఫంక్ అవుతోన్న సుజనా...ఏంటీ భూమాయ


బొత్స సత్తిబాబు బానే సవాల్ విసిరాడు...సూటిగా గురి చూసి కొట్టాడు..అది సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది..ఐదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి పాత సత్తిబాబు బైటికి వచ్చాడ్రా బాబూ అని జనం అనుకునేలా పంచ్ డైలాగులేశాడు..బైట వాళ్లూ వీళ్లూ వైఎస్సార్సీపీ అనుకూల బ్లాగులూ కూడా ఎహ పత్తిపాటి అయితే సుజనా చౌదరెందుకు భుజాలు తడముుకుంటున్నాడని రాసేసుకున్నారు కానీ...నిజానికి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి కాకపోతే...పత్తిపాటి అవుతాడా..మరీ అగ్నానం కానీ...

ఆ మాటికి వస్తే..రాజధాని చుట్టుపక్కల భూములు లేనిదెవరికి..అంతా ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటే..కుదరదు..కానీ ఈ యవ్వారాలలో " ఔను కొంటా...నీకేంటి..నా ఇష్టం..డబ్బులుున్నాయ్ కాబట్టి కొన్నాను..నీకేమైనా అభ్యంతరమా అంటూ 2014 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో బోలెడుసార్లు రెచ్చిపోయిన సుజనా...ఇప్పుడు సెంటు భూమి లేదంటూ బీదఅరపులు అరడవం కామెడీగా ఉంది..

పార్టీలు మార్చినంత ఈజీ కాదని కూడా తెలుసుంటూ సుజనాకి బొత్స వేసిన కౌంటర్ తర్వాత చూపించిన ఆధారాలు కొత్తవేం కాదు..దాని తర్వాత ఈ యలమంచిలి బైటికి వచ్చి..అన్ని ఛానళ్లకి ఆబ్లిగేషన్ లాగా...అలోవ్ అలోవ్..అంత లేదు..మావోళ్లకి ఉంటే నాకేంటి..అయినా రాజధాని ఎక్కడ..కృష్ణా జిల్లా ఎక్కడ అంటూ కొత్త రాగం తీశాడు..అయినా కింద ఇచ్చిన ఆధారాలు చూడండి..తాడికొండ ఎక్కడుంది..నవులూరు ఎక్కడుంది ఇవన్నీ కూడా రాజధానిలో కాదా..లేదంటే ఇక కేవలం వెలగపూడిలో కొంటేనే రాజధానిలో కొన్నట్లా..ఆ మాట కూడా అనేయండి వైఎస్ చౌదరి గారూ...

ఐనా ఇంత ఫంక్ అవుతున్నారెందుకు...మీకు లేనప్పుడు ఎవడో ఏదో అంటే మీకెందుకు సార్ ఉలుకు...అక్కడకి మీరొక్కరేనా మాజీ కేంద్రమంత్రి...వెంకయ్యగారున్నారు..అశోక్ గజపతిగారున్నారు..కృష్ణంరాజుగారున్నారు..ఓహో...వాళ్లంతా ఈ ప్రాంతానికి చెందినవాళ్లు కాదంటారా...సరే అయితే..మరి మీకెటూ సెంటు భూమి లేదు కదా...హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి..











Comments