లేచారు సారు..నిద్ర..ఇక జ్వరాలు పరారు


మనకో సామెత..ఉంది..దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయని..తర్వాత ఏమై ఉంటుంది..బహుశా యజమాని వాటిని చావబాది ఉంటాడు..రాష్ట్రంలో కనీసం ఆరు నెలల నుంచి విషజ్వరాలతో జనం ఏ మన్యంలోనో ఉన్నట్లుగా బతుకుతూ...ఆస్పత్రుల్లో సూదులు పొడిపించుకుంటూ బతుకు ఈడుస్తున్నారు..కనీసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా..లేదు..ఇక్కడో ఆరోగ్యశాఖ కానీ..వైద్యమంత్రి కూడా ఉన్నాడో లేడో కూడా తెలీదు..ఓ వేళ ఉన్నాడనుకుంటే..ఆయనకి యాక్సిడెంట్లలో చచ్చిపోయిన వాళ్లే మనుషులుగానూ...జ్వరాలొచ్చి..సింపుల్ గా ఓ దోమ కుట్టి జ్వరంతో చచ్చిపోయిన వాళ్లంటే లెక్కలేదనుకోవాలేమో...

ఏ పేపరు..టివి చూపించదు..ఎందుకంటే సారుకి కోపం వస్తందంట..అదే సారుకి కోపం రాకుండా..పై వార్త చూశారు కదా...ఆరోగ్యశాఖ టెస్టులు ఫ్రీ చేస్తందంట..ఎవడికి కావాలి ఈ టెస్టులు కనీసం అరకోటి జనాభాకి డెంగ్యూనో..గున్యానో సోకి పడకేసి..ఏడుస్తుంటే..దానిపైన రివ్యూ చేసే స్పృహ లేదు..చేయకపోతే చేయకపోయారు..దేశాన్ని ఉద్దరించే పనిలో ఉన్నారనుకుంటాం కానీ..నెలా నెలా జీతం తీసుకునే ఈ డిపార్ట్ మెంటల్..సో కాల్డ్ ఆఫీసర్లకి ఏమైందంట..కాస్త..ఒరే బాబూ..మీకొచ్చింది వైరల్ ఫీవర్..వైరల్ ఫీవర్‌లో ప్లేట్ లెట్లు తగ్గడం మామూలే..ఏ లక్షకి పడ్డప్పుడో కాస్త జాగ్రత్త పడండ..అంతే కానీ..రెండ్రోజులుకోసారి డెంగ్యూ టెస్టులు అవసరం లేదని కానీ..ఏ జొరానికైనా..వాడేది అయ్యే టాబ్లెట్లురా..అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టుకుని హైరానా పడకండని కానీ...ఓ చిన్న ప్రకటనఇయ్యొచ్చు కదా...

ఇప్పుడీళ్లు చేసే టెస్టులతో అందరికీ జేబు భారం తగ్గుతుందని అనుకోవాలా..లేదు లేదు..రెండో రౌండ్ కుట్టేందుకు ఈజిప్ట్ ఆడీపస్ రెడీగా ఉందంట..మీయమ్మ కడుపులుగాల..కాస్త దోమతెరలు ఫ్రీగా పంచిపెట్టండ్రా సామీ..వాటిపై మీ పేర్లూ..ముఖాలే వేసుకుని..మీకెట్టాగూ..దోమలు లేకుండా కానీ..జొరాలు రాకుండా కానీ చేసే సత్తా లేదని తేలిపోయింది..ఇంటికో పెరిథ్రిన్ స్పేయర్..పంచిపెట్టినా సరే 

Comments