బిగ్ న్యూస్..అసలు ప్రకృతి అంటే ఏంటి..మూషిక మానవుడితో జపాన్ ఛాలెంజ్


సృష్టి ఎలా పుట్టింది..లేదూ ఎలా తయారైందన్న ప్రశ్నలకే సమాధానాలు రకరకాలు..నిజమేంటనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం..అలాంటిది ప్రకృతి ఏంటి...సహజత్వం ఏంటి..దానికి విరుధ్దంగా చేయడమంటే ఏంటి అనే ప్రశ్నలు మరోసారి చర్చకు రాక తప్పదు జపాన్ చేసిన పనితో...మనిషి పిండాన్ని జంతువు అండాశయంలో పెంచడం..ఊహిస్తుంటే వళ్లు గగుర్పాటుకు లోనవదూ..అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో..వస్తేనే సిసలు శాస్త్రవేత్తలు అవుతారనుకుంటారా...లేకపోతే..వాళ్లననుకున్నదే సరైన లైన్ అనుకుంటారేమో మరి

విషయం బ్రేక్ అవగానే పదిమంది చెప్పేదాన్ని ఖండించడమే మేధావితనం అనుకునేవాళ్లు దీన్ని సమర్ధించవచ్చు..మనుషులకే చోటు చాలనంత భూమిపై మళ్లీ జంతువుల అండాశయాల్లో పిండాలను పెంచడం ఏంటండీ బాబూ...కలికాలం ఎటు పోతుందనేది కూడా ఆలోచించాల్సిందే అనేవాళ్లమూ ఉన్నాం...రచయిత అభిప్రాయాలతో ఎవరికీ నిమిత్తం ఉండకపోవచ్చు..కానీ జపాన్ ప్రభుత్వం..ఎలుకలు..చుంచెలుకలు(చిట్టెలుకలు అనుకుంటా)లో మానవపిండాలను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చింది..అందుకే ఇప్పుడు చర్చ బయలు దేరుతుంది..ఏ విభాగానికి ఆ విభాగం మనుషులు ఉంటారు..బహుశా అందరి దృష్టిని ఆకర్షించేంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడే అది తెలుస్తుంది కానీ..అప్పటిదాకా శాస్త్రలోకంలో జరిగే చర్చలు బైటికి రావు..ఉదాహరణకు కెఫే డే సిధ్దార్ధ సూసైడ్ చేసుకునేవరకూ ఆ సంస్ధలోని నష్టాలు..సిధార్ధకి ఎదురైన సమస్యలు కొన్ని వర్గాల జనానికే తప్ప మిగిలిన వారు పట్టించుకోలేదు..

ప్రస్తుతానికి మేం హ్యూమన్-యానిమల్..అంటే సంకరజాతి ని సృష్టించే ప్రయత్నం చేయడంలేదని నకౌషీ అనే సదరు ప్రేతాత్సోహికుడు చెప్పుకొస్తున్నాడు కానీ...15 రోజుల వరకూ ఎలుక అండాశయంలో పిండాన్ని పెంచుతానంటున్నాడు..ఆ సరికే సదరు ఎలుకల్లో అన్ని అవయవాలు పెరుగుతాయట..అంటే ఖచ్చితంగా మూషిక మానవుడు రెడీ అవుతాడు..ఎలాంటి ఉత్పాతాలు చూడాల్సి వస్తుందో మరి..
మన పురాణాల్లో అయితే అందంగా మత్సావతారం, నారసింహావతారం, వరహావతారం, కూర్మావతరాలను అందంగా చూపించారు..సైన్స్ మాత్రం వికృతమైన ఫోటోలనే గూగుల్ లో చూపిస్తుంది.. కొంతమందైతే ఇప్పటికే ఈ తరహా సృష్టి జరిగిపోయిందనే టాక్ ని నమ్మేస్తున్నారు కూడా

Comments