కాశ్మీరయ్యింది...ఇక నెక్స్ ట్ టార్గెట్..అదేనా


పక్కా ప్లానింగ్‌తో ఆర్టికల్ 370ని రద్దు చేసేసిన బిజెపి ప్రభుత్వం తర్వాతి టార్గెట్ ఏంటి..ఇప్పుడిదే ప్రశ్న రాజకీయవర్గాలలో కలకలం రేపుతోంది.  పగ్గాలు చేపట్టిన 50 రోజుల్లోనే తాను అనుకున్న లక్ష్యాలను చేధిస్తున్న మోదీ-అమిత్‌షా..అయోధ్యలో రామాలయనిర్మాణఁపై దృష్టి పెడతారా..లేక వాయిదా పద్దతే కొనసాగిస్తారా అనే అంశం చర్చకు వస్తోంది.
వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లోనే అదిగో ఆర్డినెన్స్..ఇదిగో గుడి అన్నట్లుగా యూపీ సిఎం ఆదిత్యనాధ్ నుంచి అప్పటి..ఇప్పటి కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు నేతలు హడావుడి చేశారు..అసలు కోర్టు తీర్పు ఏం చెప్పినా...రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా గుడి కట్టుకోవచ్చనే ఓ ఫీలర్‌ని జనంలోకి వదిలారు..అప్పుడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి దెబ్బైపోయింది..దీంతో రామనామస్మరణపై  పెద్దగా సౌండ్ విన్పించలేదు..కానీ లోక్‌సభ ఎన్నికలలో మాత్రం రామజన్మభూమిని నామమాత్రంగా ప్రస్తావించారు..తాజాగా జమ్ము కాశ్మీర్ విషయంలో చూపిన దూకుడు చూస్తే..ఇక గుడి కట్టడానికి బిజెపికి ఎలాంటి అడ్డంకులు లేవనే వాదన  ఊపందుకుంది..పైగా ఎన్డీఏ పక్షమైన శివసేనతో పాటు..విశ్వహిందూపరిషత్ కూడా ఎప్పటికప్పుడు
ఇదే అంశంపై ఒత్తిడి తీసుకురావడం గమనించాలి. సుప్రీంకోర్టు కూడా ఈ వారం నుంచే అయోధ్య అంశంపై రోజువారీ విచారణ చేపట్టనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ, అమిత్‌షా డుయో
ఏ స్టెప్ తీసుకుంటారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది.
 దీంతోపాటే జన్ సంఘ్ ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తోన్న కామన్ సివిల్ కోడ్‌పై కూడా బిజెపి ఫోకస్ పెట్టే అవకాశం కన్పిస్తోంది. దేశంలో అందరికీ ఒకటే బోర్డ్ ఉండాలనేదే..బిజెపి నినాదం..ప్రస్తుతానికి గోవాలో తప్ప యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడా అమలు కావడం లేదు.దీనిపైనే కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు గత మే నెలలో నోటీసులు జారీ చేసింది కూడా..రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి కోసం బిజెపి నేత అశ్వినీకుమార్ పిటీషన్ వేశారు. 3నెలలోపు కామన్ సివిల్ కోడ్ తయారు చేసేలా  లా కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు కోరారాయన.  ఈ పరిణామాలను గమనించిన తర్వాత..ప్రస్తుతం బిజెపి ఉన్న దూకుడు చూస్తుంటే..యూనిఫామ్ సివిల్ కోడ్‌ని కూడా పట్టాలెక్కిస్తుందేమో అన్న అభిప్రాయం కలగకమానదు

Comments