అయ్యో కాశ్మీర్ కోరుకోని విభజన..తర్వాతెలా ఉంటుందంటే


మోదీ ప్రభుత్వం వేసిన కాశ్మీర్ బాంబ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక దెబ్బకి రెండు ఆర్టికల్స్ రద్దైపోయాయ్..దీంతో ఇప్పుడు  కాశ్మీర్ ఎలా మారబోతోందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. కాశ్మీర్ విభజనతో జమ్ము, కాశ్మీర్ ఇప్పుడు రెండంచుల కత్తిలా మారే ప్రమాదం ఉంది..ఒకటి కేంద్రం చెప్పినట్లు ఉపాధి అభివృధ్ది అవకాశాలు పెరగవచ్చు లేదంటే తమ హక్కులు లాగేసుకున్నారనే ఆగ్రహంతో యూత్ ఉగ్రవాదులలో చేరడం ఎక్కువా కావచ్చు. వాస్తవానికి ఆర్టికల్ 370కి కాలక్రమేణా అనేక మార్పులు చేశారు కానీ..ఆర్టికల్ 35ఏకి మాత్రం ఎలాంటి సవరణలు చేయలేకపోయారు. ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీరీలు ప్రత్యేకమైన చట్టాలకి మాత్రమే లోబడతారు..స్థానికేతరులు
ఇక్కడ శాశ్వత నివాసం పొందలేరు..ఆస్తులు కూడబెట్టలేరు..కానీ తాజా నిర్ణయంతో ఇతర రాష్ట్రాల పౌరులు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి వీలుంది..
అలానే  సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పరిశ్రమలతో పాటు..టూరిజంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం కన్పిస్తోంది..దీంతో స్థానిక యువతకి ఉపాధి కలుగుతుంది. ఒకప్పుడు కాశ్మీరం అనే గులాబీవనాన్ని చూడటానికి ఎలాగైతే..ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వచ్చేవారో..విభజనతో అప్పటి పరిస్థితులు నెలకొంటాయని ఆశించవచ్చు..ఐతే లోయలో ఉగ్రవాదం రూపుమాసినప్పుడే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే స్థానికులకే రిజర్వ్ కాబడిన అవకాశాలు నాన్ లోకల్స్ తన్నుకు పోతారనే భయం ఏర్పడింది. అలానే ముస్లిం జనాభా తగ్గిపోయి
హిందూ జనాభా పెరుగుతుందనే వాదన కూడా ఉందంటున్నారు.

రాజకీయపరంగా చూస్తే..కేంద్రపరిధిలోకి జమ్ము కాశ్మీర్ వస్తాయి కాబట్టి..ఇక్కడ ఆర్ధిక ఎమెర్జెన్సీ విధించడం కుదురుతుంది. అలానే స్థానిక చట్టాలు కాకుండా దేశవ్యాప్తంగా అమలవుతోన్న చట్టాలే ఇక్కడ కూడా వర్తించబడతాయ్. ..శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని కేంద్రం చెప్తోంది. జమ్ము కాశ్మీర్ కోసం కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది కాబట్టి..సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. లడఖ్ ఏరియా కూడా కేంద్రపాలిత ప్రాంతం కిందకు రావడంతో..ఈ రెండు ప్రాంతాలలో ఇక అసెంబ్లీ అనేది నామమాత్రంగా మారనుంది. అంటే ఢిల్లీ, పాండిచ్చేరి తరహా పాలన సాగుతుంది. ఐతే లడఖ్‌లో ఎలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలుండవ్ కాబట్టి..ఇది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమే..రెండు చోట్లా గవర్నర్ స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్ల పాలన ఏర్పడుతుంది. ఇక జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా 111 అసెంబ్లీ సీట్లుండగా
వాటిలో 87 స్థానాలకు ఎన్నికలు జరిగేవి..2 సీట్లు నామినేటెడ్‌వి..మిగిలిన 24 సీట్లు పీఓకేకి సంబంధించి ఖాళీగా వదిలేస్తారు..కానీ కొత్త అసెంబ్లీ రూపు చూస్తే..107 అసెంబ్లీ సీట్లు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో పీఓకేకి 24 సీట్లు వదిలేస్తారు. కొత్త చట్టం ప్రకారం రెండు నామినేటెడ్ సీట్లలో ఇద్దరు మహిళా సభ్యులతో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయవచ్చు రాజ్యసభ మెంబర్ల విషయానికి వస్తే..నలుగురు సభ్యుల సంఖ్య అలానే కొనసాగుతుంది. ఐదు లోక్ సభ సీట్లు జమ్ము కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి..ఒక లోక్ సభ సీటు లడఖ్ యూనియన్
టెరిటరీకి కొత్త చట్టం ఎంపికయ్యేలా చోటు కల్పించింది.
ఇక అసెంబ్లీ పంపించే అన్ని బిల్లులు లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణ పరిధిలోకి వస్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకపోతే ఏ బిల్లూ పాస్ కాదు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా జమ్ము కాశ్మీర్‌ యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత ఇక్కడి 107 అసెంబ్లీ సీట్లను 114 సీట్లకు పెంచే ప్రతిపాదనను కూడా రాజ్యసభలో ఉంచారు. అంటే లడఖ్‌లో కోల్పోయిన నాలుగు అసెంబ్లీ సీట్లకి మరో మూడు అదనంగా రానున్న రోజుల్లో చేరనున్నాయ్. జమ్ము కాశ్మీర్‌లో ఉన్న హైకోర్టే...లడఖ్‌కి కూడా ఉన్నతన్యాయస్థానంగా వ్యవహరించనుంది.

జమ్ము కాశ్మీర్, లడఖ్‌గా విభజన  జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 367కి క్లాజ్ 4ని జోడించడం జరిగింది దాని ప్రకారం ఇప్పటిదాకా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో  ఏవైతే చట్టాలు అమలవుతున్నాయో..అవన్నీ రద్దై..దేశవ్యాప్తంగా ఏ చట్టాలు ఉన్నాయో..అవే అమలులోకి వస్తాయ్. జమ్ము కాశ్మీర్‌కి ఇకపై ప్రత్యేకమైన జెండా అంటూ ఉండదు. అలానే ఇక్కడి పౌరులకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించే ప్రాథమిక హక్కులన్నీ దఖలు పడతాయ్. భౌగోళికంగా చూస్తే..లడఖ్ అంతర్భాగంగా ఉన్న జమ్ము కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉండగా..తాజా పరిణామంతో జమ్ము కాశ్మీర్, లడఖ్ రెండూ విడివిడిగా ఉండటంతో పాటు..లడఖ్ స్వతంత్ర కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. కాశ్మీర్‌కి గతంలో జాతీయగీతం వేరుగా ఉండగా..ఇప్పుడు జనగణమననే జాతీయగీతం అవుతుంది. కేంద్రం తాజా నిర్ణయంతో దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి చేరింది.

Comments

  1. Union territories without their own legislatures:

    1. Chandigarh
    2. Dadra and Nagar Haveli
    3. Daman and Diu
    4. Lakshadweep
    5. Ladakh
    6. Andaman and Nicobar Islands

    Union territories with their own legislatures:

    7. Jammu and Kashmir
    8. Pondichery
    9. Delhi

    ReplyDelete

Post a Comment