షా స్కెచ్చేస్తే..ఇదిగో ఇలానే ఉంటుంది..షాడోకి గంగారామ్‌లా మోదీకి అమిత్ షా


మోడీ అమిత్‌షా ఏం చేసినా..అంతే..అంతా గప్‌చుప్‌గా ఉంటుంది..ఐతే ఏదో బాంబ్ పేలబోతోందన్నది మాత్రం కాస్త సిగ్నల్స్ తెలుస్తాయ్..అసలు మ్యాటర్ మాత్రం అణుబాంబులా పేలిపోతుంది..
నోట్లరద్దైనా సరే..సర్జికల్  స్ట్రైక్సైనా సరే...స్కెచ్చేశారంటే చాలు..సక్సెస్ కావాల్సిందే..ఇప్పుడు జమ్ము కాశ్మీర్ విభజన కూడా అలానే పేలింది
జమ్మూ కాశ్మీర్ విభజన విషయంలో బీజేపీ స్కెచ్ బంపర్‌గా పేలింది. ఆర్టికల్ 35ఏని రద్దు చేస్తారనే సంకేతాలు లీలామాత్రంగా తెలిసినా..ఇలా స్టేట్‌ని ఏకంగా కేంద్రపాలితప్రాంతంగా చేయడంతో పాటు..లద్దాక్‌కి ఏ మాత్రం రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేయడం మాత్రం మాస్టర్ స్ట్రోక్‌గా చెప్పాలి.  ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రక్రియకి మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా 11 రోజులు మాత్రమే తీసుకుంది. కేంద్ర బలగాల మోహరింపు నుంచి బిల్లు సభలో పెట్టడం వరకు ఆగస్టు 5లోగా పూర్తి చేయాలని ప్రధాని, హోంమంత్రి ఇద్దరూ ముందే డిసైడయ్యారంటారు.
 ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో కేంద్రం మనసులో ఏముందో తెలీక అంతా తెగ టెన్షన్ పడ్డారు. . అయితే ఊహించనిదేదో జరగబోతోందని మాత్రం తెలిసింది. ముందుగా కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను గత వారం రోజుల నుంచి  రంగంలోకి దింపడం ప్రారంభించింది. అలా ఆదివారం సాయంత్రం నాటికి 430 కంపెనీల సీఆర్పీఎఫ్ ట్రూప్స్‌కు చెందిన 43వేల మంది పారామిలటరీ బలగాలు జమ్మూ కాశ్మీర్‌లో మోహరించాయి. బలగాలను తరలించేందుకు ఎయిర్‌ఫోర్స్‌లో కొత్తగా చేరిన సీ - 17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఈ వారం రోజుల్లో 100కు పైగా చక్కర్లు కొట్టాయి

మరోవైపు అల్లర్లు కనుక రేగితే కంట్రోల్ చేయడానికి..కేసులు విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్‌లాగా కోర్టులను..జడ్జిలను నియమించారు..ఈ సంగతి బైటి ప్రపంచానికి అసలే తెలీదు.. దాదాపు 60 మంది అడిషనల్ స్పెషన్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ల సేవలు తీసుకున్నారు. అలానే హింసాత్మక ఘటనలు తలెత్తితే  చర్యలు తీసుకునేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు ఏర్పాటు చేశారు. తద్వారా నిందితులను వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లభించింది.  అరెస్టైన వారిని తరలించేందుకు శ్రీనగర్‌లో ఆరు తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. ఘర్షణల్లో గాయపడినవారికోసం డాక్టర్ల సెలవులను రద్దు చేశారు.  అలానే లోయలో ఇఁటర్నెట్, సెల్ ఫోన్ సర్వీసులు నిలిపివేశారు..బైటి నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా..లోయ వదిలిపోవాలని సూచించారు. ఐతే ఇదంతా ఏదో ఉగ్రముప్పు ఉందనే కలరింగ్ ఇవ్వడంతో జనం దృష్టి మళ్లింది. ఇక సోమవారం నాటికి ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా పని చేయకుండా చేసారు..భద్రతా సిబ్బంది కోసం భారీ సంఖ్యలో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.అలా ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కాకుండా ఏకంగా రాష్ట్రాన్నే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా కేంద్రం అధీనంలోకి జమ్ము కాశ్మీర్ వెళ్లిపోయింది. ఇక స్పై కమ్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మంగళవారం జమ్మూలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తారు..ఆ తర్వాత ప్రధాని మోదీ మొత్తం వ్యవహారంపై ప్రసంగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం శుభం కార్డు పడిన తర్వాతే హీరో ప్రసంగం ఉంటుందన్నమాట

Comments