ధోనీ..ఇక అలా సెట్ ఐపోతాడా..!

మహేంద్రసింగ్ ధోని..తాను ఎంట్రీ ఇవ్వడానికి ముందు సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ వంటి లెజెండ్‌లు ఉన్నా..వారికంటే ఎక్కువే పేరు తెచ్చుకున్న గ్రేట్ ప్లేయర్..సచిన్ కంటే ఎక్కువ పేరు అనడంలో ఆయన్ని తక్కువ చేయడం కాదు..సచిన్ రికార్డులైతే ఎవరూ బద్దలు కొట్టలేరేమో కానీ..పాపులారిటీ మాత్రం ధోని పీక్స్ కి తీసుకెళ్లాడు..( అసలు రికార్డులు ఎప్పుడూ బ్రేక్ అవుతుంటాయ్ కదా..సచిన్ కి ఉన్న రికార్డులను కోహ్లీ ఎలా సునాయాసంగా లేపేస్తున్నాడో చూస్తున్నాం కదా..) ..అంతటి ప్లేయర్ ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నాడు..ఈ దశలో టీమ్ లో ప్లేస్ ఉంటుందా..ఉండదా..లాంటి జంఝాటం..అందరికీ ఎదురవుతుంది..

ఇప్పటికే ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కశ్మీర్ బోర్డర్ లో రెండు నెలలు గడిపి వచ్చిన ధోని..రిటైర్మెంట్ తర్వాత కూడా ఓ గౌరవప్రదమైన కెరీర్ చూసుకుంటున్నట్లే కన్పిస్తుంది..దాంతో పాటే భుక్తి గడవడానికి ( ఈపదం కాస్త అతకదేమో..కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే దోని భుక్తికి లోటేంటి ) ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్నాడట

నీరజ్ పాండే ధోనిపైనే ...సుశాంత్ రాజ్ పుత్ తో అన్ టోల్డ్ స్టోరీ తీసాడు..అప్పట్లోనే ఎంటర్ టైన్మెంట్  ఇండస్ట్రీపై ఓ అవేర్నెస్ వచ్చిందట మనోడికి..అందుకే తనకి క్లోజ్ గా ఉండే జాన్ అబ్రహాంతో కలిసి ఓ సినిమా తీయబోతున్నాడట..ఇందులో తాను మాత్రం యాక్ట్ చేయడట..ఇది స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుందో లేక..జనరల్ బాలీవుడ్ మూవీనో తొందర్లోనే తెలుస్తుంది.

Comments