పోలీసులకే పవర్ కట్ చేశాడు..కామన్ మేన్ దెబ్బ


ట్రాఫిక్ పోలీసులు..పోలీసులు వేరా...ఒకళ్లేనా...ఈ డౌట్ సరే..ముందు స్టోరీలోకి వెళ్దాం..అనగనగా...ఆగ్రా ...ఫిరోజాబాద్ జిల్లాలోని లినేపార్ పోలీస్ స్టేషన్..సాయంత్రం 6 గంటలు అయింది..ఉన్నట్లుండి పవర్ పోయింది..నాలుగు గంటల సేపు కరెంట్ లేకుండా..పోలీసులు పని  చేయడమంటే మాటలు కాదు..ఎందుకంటే వచ్చీ పోయిే జనం..పని చేసినా చేయకపోయినా చిక్కులే..యోగీ సర్కారు ఎప్పుడే హడావుడి  చేస్తుందో తెలీదు కదా..విషయం ఏమిటయ్యా అంటే..
శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ పవర్ కనెక్షన్ కట్ చేశాడట..ఎందుకంటే..అతగాడు బడీ చాపేటీ అనే ఏరియాలోని లేబర్ కాలనీలో ఓ రిపేర్ ఉంటే చేసి వస్తున్నాడట..అప్పుడు పోలీసులు శ్రీనివాసుని ఆపి హెల్మెట్ లేదు కదా..ఫైన్ కట్టు అని 500 చలానా రాశారట..దానికి బాబులూ..నేనంత ఇచ్చుకోలేను పైగా అక్కడ అర్జంట్ ప్రాబ్లెమ్ అంటే హడావుడిగా వెళ్లానని తన పై ఆఫీసర్ చేత కూడా ఫోన్ లో చెప్పించాడట..

సిన్సియర్ అండ్ స్ట్రిక్ పోలీసులైన వాళ్లు మాత్రం వినలేదు..విక్రమార్కుడిలో రవితేజలాగా మీసం మెలేసి రూల్స్ చదివారట. అప్పుడు మొదలైంది అసలు కథ..మీరు చెప్తున్న రూల్స్ అన్నీ బానే ఉన్నాయ్..మరి మీ లినేపూర్ పోలీస్ స్టేషన్ కట్టాల్సిన పవర్ బిల్ ఎంత ఉందో తెలుసా..ఆరున్నరలక్షలరూపాయలు దాటిన మీ కరెంట్ బిల్ అప్పు ఇంకా కట్టలేదు..ఫైన్ తో కలిసి ఏడులక్షల రూపాయలు కట్టాలి మీరు..మరి మీకు లేవా రూల్స్ అని శ్రీనివాస్ అండ్ కో రివర్స్  క్లాస్ పీకారట..ఐనా పోలీసులు..ఆ బొంగులే మమ్మల్నెవడు అడుగుతాడన్నట్లుగా ముక్కు పిండి మరీ ఆ ఐదొందలు వసూలు చేసారుట. వళ్లుమండిపోయిన మన హీరో డైరక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరకి పోయి ఫీజులు కట్ చేసాడు..ఆ తర్వాత దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్..అంటే అక్కడి డిస్కమ్ మేనేజర్ కూడా..పోలీసులు పవర్ బిల్ పైసా కట్టకుండా మూడేళ్ల నుంచి ఎంజాయ్ చేస్తుంది నిజమే అని కన్ఫామ్ చేశాడట..ఐతే ఈ ట్రాఫిక్ చలనాకి పవర్ కట్ కి మాత్రం సంబంధం లేదన్నాడట..

ఆ ( లేకపోతే...ఉంది బాబూ మావోడు ప్రతీకారం తీర్చుకున్నాడని ఎవరైనా చెప్తారా ఏంటి..ఏం చేస్తారు పాపం బకాయిలు మొత్తం తీర్చేస్తాం అని హామీ ఇచ్చిన తర్వాతే కరెంట్ మళ్లీ ఇచ్చారట..శ్రీనివాస్ మీద చర్య తీసుకోవాలంటూ డిస్కమ్ కి పోలీసులు కంప్లైంట్ చేసారట..కానీ సేమ్ డిపార్ట్ మెంట్..కదా..ఎవడైనా తీసుకుంటాడా యాక్షన్..మరి బిల్ సంగతేంటి అంటారా...ఎవడైనా కడతాడా సర్ 7లక్షల బిల్..ఎవడో వచ్చి పవర్ మాఫీ చేసేంతవరకూ లినేపార్ పోలీసులు కట్టరని గోచరిస్తోంది మరి..
స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే..ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడు..దాంతో పాటు నాలుగునెలల నుంచి జీతాలు అందక కష్టాలు పడుతోన్న జీవి అట..మరి కడుపు మండితే ఎలా ఉంటుంది..ఇలానేగా

Comments