బాబుగారు పాలిచ్చే ఆవట..ఇంకా బుద్ది రాకపోతే ఎలా


నేనెందుకు ఓడిపోయా...
ఈ ప్రశ్నకి బహుశా చంద్రబాబుగారికి ఎప్పటికీ బదులు రాదు..ఎందుకంటే ఆయన నిజాన్ని గమనించకుండా..కళ్లు మూసుకుని ఉండిపోయాడు కాబట్టి..చుట్టూ ఉన్నోళ్లు అంతకంటే ఘనులు కాబట్టి..నియోజకవర్గానికో ఎమ్మెల్యే జనాలపాలిట అసురులులాగా పీక్కు తింటే..టిడిపి కాదు..ఎలాంటి పార్టీకైనా అలాంటి గతే పడుతుంది..ఇంకా అదేదో మాయలాగా...తన తప్పేం లేదు.జనమే తప్పు చేసారనేలా వ్యవహరిస్తే..అమాయకంగా కల్లబొల్లి కబుర్లు చెప్తే..ఎవరూ నమ్మరు..పైగా నవ్వుకుంటారు
ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా..ఇంకా అదే నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఎలా..పైగా మీకంటూ సోషల్ మీడియాలో కొంతమంది మేధావులు ఉన్నారు..ప్రతి బొక్కనీ...ఆ బొక్క అదికారపక్షం బొక్కగానే చూపుతూ..వైరల్ చేయగల సమర్ధులు ఉన్నారు..వాటిలో మంచివాటిని ఎంచుకుని...మాట్లాడితే కాస్త జనంలో తిరుగుతున్న సంకేతాలు వెళ్తాయి కానీ..ఊరికే..నేనేం తప్పు చేసాను...23 సీట్లే ఇచ్చారంటూ వాపోవడం ఏంటి బాబుగారూ

పైగా పాలిచ్చే ఆవుని కాదని..దున్నపోతుని తెచ్చుకున్నారంటూ కామెంట్ చేయడం మీ పరణతికి..విచక్షణకే వదిలేయాలి...అసలు మీకు ఈ 23 2014లోనే రావాల్సింది..పవన్ కల్యాణ్, మోదీ అండతోనే గట్టెక్కారనే విషయం చూచాయగా కూడా గ్రహించరా..అప్పట్లోనే వైఎస్సార్సీపీకి 63 సీట్లు వచ్చాయంటేనే సింపుల్ ఈక్వేషన్ మీరు గ్రహించడం లేదు..లేదంటే మీ అహం అడ్డుపడుతోంది..మీ మిత్రులు దూరం కావడం..నాలుగున్నరేళ్లలో మీరు చేసిన నిర్వాకాలు వాటికి తోడు కావడంతోనే ఈ ఓటమి దక్కింది మీకు...ఇంతకంటే ఎక్కువ ఆలోచించి బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం..ఏ మిషన్లపైనో మిష పెడితే..ఇఁకాస్త అభాసు పాలవుతారు..ఇక్కడ ఇంటర్నెట్ లో కామెంట్స్ పెట్టే వీరులు గ్రౌండ్ లెవల్లో వాళ్ల వాళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిసి తిరిగితే...అప్పుడు ఏం చేసారో తెలుస్తుంది..అంతేకానీ పిచ్చ వ్యామోహంతో..అబ్బా..ఆ పాలన...అబ్బబ్బా..భేషబ్బా అనుకుంటే..ఇలా వాపోవడాలే మిగులుతాయ్..

.ఇక పాలిచ్చే ఆవుని కాదని..అంటూ ఎద్దేవా చేసినంత మాత్రాన ఇక్కడ వైఎస్సార్సీపీ పాలన ఏదో అధ్ధ్వాన్నంగా ఉందని ఎవడూ ఫీలవడు..ఎందుకంటే..అతను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మొదటి పదిహేను రోజులలోనే అడుగులు వేస్తే..ఇంకా ముతక సామెతలతో కాలక్షేపం ఏంటండీ..అన్నట్లు పోలవరంపై నోటీసులు వచ్చాయట..చూడండి..అది ఎవరి నిర్వాకమో తేలుతుంది ఇప్పుడు..ముందు దానికి సమాధానం చెప్పండి..
కింద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియో పూర్తిగా చూడండి..బాబుగారు ఇంకా ఏేమేం మాట్లాడారో తెలుస్తుంది


Comments

  1. ఎన్నికల ప్రచారంలో బోయపాటి సీను ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో "పాలిచ్చే ఎద్దుకు పసుపు కుంకుమ" షార్ట్ ఫిలింతో ఊదరగొట్టారు. ఎంత మేపినా ఎద్దు పాలు ఇవ్వదన్న వాస్తవాన్ని గుర్తించిన జనం గడ్డి పెట్టినా కౌబాయ్ గారికి బుద్ధి రానట్టుంది పాపం.

    ReplyDelete
  2. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కిందట (సెప్టెంబర్ 2015) తెలంగాణాలో ఆషా కార్మికుల నిరసన తాలూకా ఫోటోని ట్వీట్ చేసిన వైనం:

    https://muchata.com/chandra-babu-wrong-tweet-with-old-pic/

    ReplyDelete

Post a comment