సంపూర్ణ మద్యపానంపై నీకెందుకు బాధ నోకేశా...! మీ గ్నానానికి జోహోర్లు


ఒకదాని తర్వాత ఒకటి వరస ట్వీట్లు...
జోరు పెంచిన లోకేష్
ఇక ఫర్లేదు టిడిపి(అప్పోజిషన్ పొజిషన్)కి వచ్చిన ఢోకా లేదనుకుంటోన్న కార్యకర్తలు
బాబుగారి తర్వాత ఎవరు..బ్రహ్మానందం తర్వాత ఎవరు అన్నట్లుగా ఓ ప్రశ్న టిడిపిలోకంటే బైటే బాగా విన్పించేది..ఐతే ఆ లోటుని నారావారి వంశతిలకం బ్రహ్మాండంగా పూడ్చుతున్నట్లు ఆయన ట్వీట్లే చెప్తాయ్..జనంలోకి వచ్చి నాలుగు మాటలు మాట్లాడితే..ఎక్కడ వైఎస్సార్సీపీ బ్రహ్మాండం బద్దలు అవుతుందో అనుకుంటూ..కేవలం ఓ అజ్ఞాతవాసిలాగా ట్వీట్లతోనే వైరిపక్షాన్ని..ఇటు స్వపక్షాన్ని కూడా చీల్చిచెండాడగల ప్రతిభాశాలి ఈయన..
అందుకు ఎన్నో ఉదాహరణలు..తాజా ట్వీట్లు చూస్తే.ఆ విషయం క్లియర్ గా అర్ధమైపోద్ది..దీనికోసం పెద్దగా వెతకక్కర్లేదు కూడా..

పై ట్వీటే చూడండి..సంపూర్ణ మద్యపానం అంటూ జగన్ ఇకపై చెప్పకూడదట...ఇది చూసి పాపం టిడిపి సోషల్ మీడియా వింగే ఆశ్చర్యపోయింది..బోలెడంత తర్జనభర్జన తర్వాత మా యువసారు టాలెంట్ సూపరంటూ సంబరపడిపోయింది..ఐతే అందులో ఒకడికి  అనుమానసందేహం కలిగింది..బాసూ..జగనెప్పుడూ సంపూర్ణమద్యపాన నిషేధం అనలేదే ..దశలవారీగానే అని చెప్పాడే అని..కానీ తెలుగు బ్రదర్స్ మాత్రం..ఎహ ఆపు..చిన్నబాస్ ట్వీట్ పెట్టాడంటే నిజమే అయింటుంది..అట్టా వాదించమాక అన్నాడట..ఇక ఆ తర్వాత..కింద పేపరేంది గురూ భలే పెట్టాడే అంటే...ఏం లేదు బాసూ..మన రాజకరపత్రిక ఉంది కదా..అది దేశంలో మాంద్యానికి ఆంధ్రదేశానికి ముడిపెట్టి..జగన్ పై బండలేసే పనిలో ఉంది కదా..అది మనోడు భలే లాగేశాడన్నాడు..
మరి ఈ 28శాతం డెవలప్ మెంట్ ఏందీ..ఏడైనా ఉందా..అంటే అట్టనే పెట్టాలి...లేకపోతే..5.37శాతం అంటే..మంచిగానే డెవలప్ మెంట్ రేటుంది కదా అంటారు..అదే ఓ  యాభైశాతం వృధ్ది రేటు టార్గెట్ పెట్టుకున్నాడు జగన్ అని రాసి..ఐతే 5శాతమే అని వస్తుందట..అంటే భలేగా ఉంటుంది కదా..ఛ..ఏంట్రా ఇది అని జనం ఫీలైపోయి బాబుగారే గొప్ప అంటారు  కదా..అని ఉపదేశం చేశాట్ట..
మరి మందు సంగతి కూడా అంతేనా..అంటే..లేదు గురూ...లిక్కర్ రేట్లు బాగా పెంచేసి అందుబాటులో లేకుండా చేస్తే పేదోడు తాగడు కదా అని జగన్ ఓ బండ ఐడియా వేసాడు కదా..అందుకే తాగినోళ్లు తగ్గినా ఆదాయం మాత్రం బాహుబలి రేంజ్ లో కన్పిస్తుంది. కానీ మనం దాన్ని హైలైట్ చేయం...రెవెన్యూ బాగా తాగించి తెస్తున్నారనే చేయాలన్నాట్ట...


మరి పైన ఆశా సెల్లి కబుర్లేందంటే..3 వేల నుంచి 10వేలకి పెరిగితే...పనిపై పర్యవేక్షణ ఉంచకుండా నెల తిరిగేసరికి ఖాతాలో డబ్బులు వేయాలట..ఇదే లోకేశ్ గారి బాధ..మరి మెడలో పచ్చ కండువా ఏందన్నా అంటే..అర్రర్రే..కవర్ చేయలేకపోయామే...ఈసారి వీడియోలో ఇంకాస్త పకడ్బందీ ఏర్పాట్లు చేద్దాంలే అంటూ తమ్ముళ్లు ముక్తాయింపు నిస్తున్నారట..
చూశారా తెలుగు(పచ్చ) మీడియా పవర్ అంటే అదీ


Comments