ఆ రెండు సీన్లే సాహోని కాపాడాలా..డీసీ స్టోరీ

సాహో...ఓ స్పై మూవీలా అన్పిస్తుంది..సీన్లు చూసినా..ట్రైలర్ చూసినా ముఖ్యంగా మందిరాబేడీ కామెంట్లు విన్నప్పుడు సాహో అనేది ఓ మిషన్..దాన్ని ఆపడానికో...పట్టాలెక్కించడానికో ప్రబాస్ ట్రై చేస్తుంటాడనిపిస్తుంది..ఐతే ఈ ఫస్ట్ కాపీ చూసిన బయ్యర్లు మాత్రం బోలెడంత నిరాశగా ఉన్నారంటూ డెక్కన్ క్రానికల్ రాసుకొచ్చింది..

కేవలం రెండంటే రెండు సీన్లు అల్టిమేట్ గా ఉన్నాయని..అవే సినిమాని కాపాడాలని చెప్తున్నారట..ఐతే ఆ రెండు సీన్లు లెంగ్త్ మాత్రం చెరో పదినిమిషాల చొప్పున 20 నిమిషాలు ఉంటాయంటున్నారు..అంటే రెండున్నరగంటల సినిమాలో ఇరవై నిమిషాలంటే 25శాతం కింద  లెక్కేసుకోవచ్చు..వాళ్ల మాటలను బట్టి డీసిలో రాసిన కథనాన్ని బట్టి.. కంటెంట్ తక్కువ కటౌట్ ఎక్కువలాగా మనం అర్ధం చేసుకోవచ్చు..మరి దేశం మొత్తమే కాదు..ప్రపంచం మొత్తం దీనిపై ఇంట్రెస్ట్ పెట్టి చూడాలంటే..యాక్షన్ సీన్స్..కావాలి..అందులోనూ స్పై మూవీ అయితేనే అది అందరికీ ఎక్కుతుంది..ఇదే మ్యాటర్ ని సుజిత్ తీసుకున్నాడని ప్రస్తుతానికి అన్పిస్తుంది..సినిమా రిలీజ్ అయిన తర్వాత డీసీ స్టోరీలోని నిజానిజాలు బైటికి వస్తాయి..

ఐతే పెద్ద సినిమా రిలీజ్క్ ప్రమోషన్స్..యాడ్స్ ఇవ్వకపోతే నెగటివ్ స్టోరీలు ఛానళ్లు..సైట్లలో రాసుకోవడం ప్లే చేయడం మామూలే..డీసీ స్టోరీ అందులోని భాగమో..లేక నిజంగానే సినిమాలో రెండు యాక్షన్ సీన్లే ప్రధానమో ఆగస్ట్ 30న తేలిపోతుంది..ఓ వేళ కంటెంట్ లేకపోతే మాత్రం ఇప్పుడు ఎంత హైప్ ఉందో..అంతకి రెండింతలు నెగటివ్ కామెంట్లు చేయడానికి పనికిమాలిన సన్నాసులు రెడీగానే ఉంటారు..

Comments