జగనూ..ఎందుకయ్యా ఆ శ్రీనివాసునిపై అంత ప్రేమ


మనకి ఎవరైనా నచ్చితే నెత్తిన పెట్టుకుంటుంటాం..వారిలో లోపాలున్నా..వెనకేసుకుని రావడం కూడా కామన్..ఈ లక్షణం పొలిటికల్ లీడర్లకి కూడా ఇంకొద్దిగా ఎక్కువే..ఇలాంటి ఆపేక్షనే గతంలో వైఎస్..చంద్రబాబు, ఇప్పుడు జగన్ కూడా తమకి నచ్చినవారిపై క్లోజ్ సర్కిల్స్ ‌లోని వారిపై చూపిస్తున్నారనడంలో సందేహం లేదు..

ఫరెగ్జాంపుల్..తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇష్యూనే చూద్దాం..ఇది మోస్ట్ క్రేజీ బోర్డ్ ఇన్ ద వరల్డ్ అనడంలో సందేహం లేదు..ప్రపంచంలో ఎక్కడ నుంచి వచ్చినా..వారికి స్వామి దర్శనం కావాలంటే..అది కూడా సులువుగా..శీఘ్రంగా...అతి దగ్గరగా అంటే..పాలకమండలి సభ్యుల చేతుల్లోపనే..రాజలాంఛనాలతో దగ్గరుండి శ్రీనివాసుని దర్శనం చేసుకోవడం అంటే అదెంత అదృష్టమో అనుభవించిన వారికే తెలుస్తుంది..

క్యూ లైన్లలో లక్షలమంది పడిగాపులు కాస్తుంటే..దర్జాగా లోపలికి వెళ్లిపోయి గర్భగుడిలో శ్రీనివాసునికేసి మనం కూడా చిద్విలాసంగా ఓ లుక్కేసి రావాలంటే అంత ఈజీ కాదు..అందుకే బోర్డు చైర్మన్ నుంచి..బోర్డు సభ్యులు..అంతెందుకు టిటిడిలో ఓ  ప్యూన్ ఉద్యోగం దొరికినా చాలని ఫీలయ్యేవాళ్లు బోలెడుమంది ఉంటారు..అది స్వామిపైన భక్తితో కావచ్చు..సంపాదనపై మోజుతో కావచ్చు..(ఇలా దర్శనాల పలుకుబడిని డబ్బు రూపంలోకి బ్రహ్మాండంగా మార్చుకుంటుంటారు)



ఇంతకీ ఇప్పుడు టిటిడి బోర్డు మొత్తం మారిపోతుంది..ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా..అందుకు..అందులో భాగంగానే కేసీఆర్..అమిత్ షా..వాళ్లకెవరు దగ్గరో..వాళ్లని జగన్ కి రికమండ్ చేశారట..మరి జగన్ కూడా తన కోటాలో కొంతమందిని ప్లాంట్ చేస్తారు కదా..వాళ్లలో అగ్రగణ్యులెవరంటే..ఎన్..శ్రీనివాసన్..ఇండియా సిమెంట్స్ ఎండి.. ఈయన గుర్తుండే ఉంటుంది...దాల్మియా సిమెంట్స్ కేసులో సహ నిందితుడు..అలానే ధోనికి క్లోజ్..ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బిసిసిఐలో ఉన్నప్పుడు ఈయనపైనా ఎంక్వైరీ జరిగింది..
ఐతే జగన్ పత్రిక సాక్షిలో ప్రదానంగా పెట్టుబడి పెట్టారీయన.. ఆ ఓపెనింగ్ స్టిల్ చూడొచ్చు..వారి లాభాలు వాళ్లకి ఇచ్చేశాడు కూడా జగన్..ఐనా ఇంకా ఈయనపై అబిమానం చూపించడం..భవిష్యత్తులో చిక్కులు తీసుకురావచ్చు..ఆ వస్తే..ఏంటి..జగనిక్కడ..డోంట్ కేర్..అంతే మనోడికి నచ్చితే అంతే ఉంటుంది..తేడా వస్తే మాత్రం ఆ కథ వేరు..అప్పడు చూద్దాంలెండి


Comments