ఆ ఒక్క సెకనే చంద్రయాన్2ని ముంచేసిందా..విక్రమ్ కన్పించినా 15 రోజులలోపే..!


ఒక్క సెకన్ తేడా జీవితాన్ని మార్చేస్తుందా..అంటే అవును మార్చేస్తుంది...ఇప్పుడు ఇస్రో నే చూడండి..48 రోజుల జర్నీ తర్వాత..ఒక్క సెకన్ తేడా వచ్చింది ఇప్పుడు ల్యాండింగ్ కి రెడీ గా ఉందని సెప్టెంబర్ 5కి ముందే ఇస్రో చెప్పేసింది..అప్పట్లో ఆ ఒక్క సెకన్ మాటని ఎవరూ పట్టించుకోలేదు..కానీ రెండంటే రెండు నిమిషాల ముందు..రెండు కిలోమీటర్ల..వంద మీటర్ల దూరంలో విక్రమ్ కన్పించకుండా పోోవడం..ఐ మీన్...సంబందాలు తెగిపోవడం..
అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కువగా జరిగే ప్రక్రియే కావచ్చేమో కానీ..భారతీయులకి మాత్రం ఓ తీరని నిరాశగా మిగిల్చింది..
ఐతే ఇప్పుడు ఆర్బిటర్ విక్రమ్ ఫోటో తీసిందంటూ ఇస్రో అనౌన్స్ చేసింది..కానీ అదిప్పుడు ఎలా ఉందో తెలీదు..దక్షిణ ధృవంపైనే దిగాలనే లక్ష్యమే చంద్రయాన్2 ఫలితానికి కారణమా..ఏమో చెప్పలేం..లేక సెకను తేడానో..లేదంటే ఆరంభంలోనే అనుకున్నదానికంటే ఎక్కువ వడి పెరిగిన ఫలితమో..లేక..దిగీ దిగగానే..వాతావరణంలో తేడాతో కమ్యూనికేషన్స్ బ్రేక్ అయ్యాయో కూడా చెప్పలేం..ఐతే ఒకటి కంటికి కన్పించని ఓ శక్తి కూడా మానవప్రయోగాలకు సహకరించాల్సిందే అని ఈ ప్రయోగం మరోసారి ప్రూవ్ చే సినట్లే అనుకోవాలి..దాన్ని దేవుడు అనుకోవచ్చు...ప్రకృతే అనుకోవచ్చు..
ఐేతే విక్రమ్..ప్రజ్ఞాన్( ల్యాండర్ రోవర్లకి ఉన్న పేర్లివి) రెండింటి లైఫ్ టైమ్ 14 రోజులే కాబట్టి..సెప్టెంబర్ 19లోపే ఇస్రో వాటితో కమ్యూనికేట్ చేయగలగాలి..లేదంటే..అంతరిక్షంలో డెబ్రిస్ లానో...ఎవరికీ పట్టిన ఒంటరి అన్వేషకుడిలానో విక్రమ్ చందమామపై తిరుగుతూనే ఉంటాడు
కింది వీడియో చూడండి..మోదీ ఎందుకు మెజారిటీ జనం మెచ్చుకుంటున్నారో తెలుస్తుంది

https://www.youtube.com/watch?v=wAaRvS3TMkU&t=45s

Comments