బాబూ స్థపతులూ...ఏదో చేయబోయి ఇంకేదో చేశారుగా..


ఆంధ్రజ్యోతోడు అంతే..మనకి ఎప్పుడూ యాంటీగా రాస్తాడు...వాటికేం మనం భయపడం..మనమెందుకు ఎక్స్ ప్లనేషన్ ఇయ్యాల..ఇలాగుండే తీరు కాస్తా
..యాదాద్రి గుట్ట విషయంలో రివర్సైందేంది చెప్మా..యమర్జంట్ గా సాయంత్రానికి భేటీలేసి...రాత్రి 9 గంటలకు అన్ని ఛానళ్లలో కవరింగ్ కోసం ముందే ఇన్పర్మేషన్లు ఫామ్ చేసి మరీ..స్తపతులు..లైవ్ కొచ్చారు..వచ్చి ఏం జెప్పారు...

అయ్యా మాకెవడు స్ఫూర్తినిస్తే..వాళ్లని చెక్కుతాం..(మరి వీళ్లకి డబ్బులు కూడా అందుకే ఇస్తారా)..అంతేకానీ ఏవి చెక్కమంటే అవి చెక్కమంటూ చెక్కభజన చేశారు..పనిలో పనిగా..డామేజ్ కంట్రోల్ సంగతేమో కానీ...ఇంకాస్త ఎక్కువ చేశారు..ఠాఠ్..అవి మేం చెక్కినవి కాదు..ఎవుడో పెట్టాడక్కడ లాంటి అడ్డగోలు బుకాయింపులు లేకపోవడమే కాస్త ఊరట

ఐనా ...గుట్ట అని పిలవబడే  లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ రేంజ్ లో బాగుపరుద్దామనుకున్నప్పుడు..ఇలాంటి చిల్లర పనులు చేయడమెందుకు..పైగా బుకాయించుడు..కారు కాదు..సైకిల్ ఉఁది ఎడ్లబండి  ఉంది అనుకుంటూ..ఇంకా ముందుకో అడుగేసి..కమలం గుర్తు కూడా ఉంది..బాబూ హిందూ దేవాలయాల్లో కమలపుష్పం సర్వసాధారణంగా ఉఁడేదే..ఆ లెక్కన రేపొద్దున్న ప్రతి గుడిలో ఇలానే కారు..ఎడ్లబండి..సైకిల్ గుర్తులు కూడా వేస్తా  పోతారా..5వేల స్తంభాలున్నాయంటూ కబుర్లు చెప్పొద్దు..మరి కేసీఆర్ కిట్ అంటూ ఆ బండ సంగతేంది..గుళ్లలో కూడా పార్టీలు...పతాకాలు తీసుకొచ్చిన ఘనులకు..మళ్లీ సన్నాయి వత్తాసు ఒకటి..

అసలు ఎవడికీ తెలీని సంగతిని ఇప్పుడీ స్తపతుల ప్రెస్ మీట్ తో ప్రపంచం మొత్తం ముందు అభాసు పాలైనట్లేగా..

Comments

  1. బాహ్య ప్రాకారం స్థంభాలపైన కేసీ ఆర్ బొమ్మ, తెలంగాణా కు సంబంధించిన ఇతర బొమ్మలు చెక్కడాన్ని నేను సమర్థిస్తాను. అసలు యాదాద్రి ఆలయపునర్నిర్మాణానికి, అంతగొప్ప కార్యాన్ని చేపట్టి ఇంత తక్కువ సమయంలో పూర్తి చేస్తున్న కేసీ ఆర్ బొమ్మ చెక్కడం తప్పు కాదు.

    ReplyDelete
  2. గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉంది
    భుక్తీ శక్తీ కావాలంటే మానవ సేవ చెయ్యాలంటే

    ReplyDelete

Post a Comment