బాబూ జగన్..ఏమైందీ ..ఆ గొంతేంటి


100 డేస్ సూపర్ హిట్ మూవీ...మరి సెలబ్రేషన్స్ లో హీరో మాట్లాడాలి గా..అలానే మాట్లాడాడు..కానీ ఏంటి మన హీరో గొంతులా లేదే...ఆ మాడ్యులేషన్ అలానే ఉంది కానీ గొంతంతా ఏమైంది..ఎందుకలా మాట్లాడాడు..ఇలా సాగిపోతాయ్ మాటలు మన హీరో హండ్రడ్ డేస్ ఫంక్షన్ లో ఏదైనా తేడా వస్తే..

కానీ ఇక్కడ హీరో జగన్..సిఎంగా వందరోజులు పాలన పూర్తి..మనకి అనుకూలమైన ఛానల్స్ లో భజన..ప్రతికూలంలో చెప్పడమెందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ హోరెత్తించి ఉంటారు..పేరుకి వందరోజుల పాలనపై సమీక్ష అనో చర్చ అనో...కానీ అందులో చూపించేది..పవన కల్యాణ్ సొదలు..చంద్రబాబు వ్యథలు..ఇంకా మాట్లాడితే మన తమ్ముళ్ల డైలాగులు..ఇంతేనా...

కానీ శ్రీకాకుళంలో 200 కిడ్నీ పేషెంట్ బెడ్ల ఆస్పత్రి శంఖుస్థాపన చేయడం ఓ గొప్ప విషయం. ఇక్కడే
.మన బాబుగారు..పవన్ గారు వెళ్లడం..అక్కడికి టిడిపి మంత్రులను పంపి రాయబారం చేసిన సీన్ గుర్తుకురాకుండా మానదు..మరి వాళ్లు చేయలేనిది జగన్ చేయడం ఎలా నచ్చుతుంది..అదే బాబుగారైతే..శంఖుస్థాపన లేకుండానే ఆస్పత్రి బిల్డింగ్ ఓపెనయ్యేది..వార్డు ఓపెనింగ్..డిస్పెన్సరీ ఓపెనింగ్..ఐసీయూ ఓపెనింగ్ ఇలా ఉండేది. అదే కదా స్ట్రాటజీ..
ఇవన్నీ పక్కనబెడితే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొంతు మాత్రం చాలా బీభత్సంగా పాడైపోయింది..కొద్ది రోజులుగా జగన్‌ తీసుకునే ఫుడ్‌లో తేడా రావడంతో పాటు..కాస్త జ్వరం కూడా వచ్చిందట..దీనికి తోడు జిల్లాల పర్యటనలలో తాగిన మంచినీళ్లు కూడా తేడా చేయడంతో గొంతు విపరీతంగా బొంగురుపోయి..చివరికి పీలగా..కీచు స్వరం బైటికి వస్తుంది. దీనికి డాక్టర్లు మందులు రాసినా వాడకపోవడంతోనే పరిస్థితి ఇలాగైందట

Comments