ఏరీ ఆ దమ్మున్న మగాళ్లు..చింతమలేడు..కూన జాడ కూడా లేదే


రొమ్ములు విరుచుకుని సవాళ్లు విసరడంలో వాళ్లకి సాటి లేరు..ఏ సెంటర్ లో అయినా తమ తడాఖా చూపించడానికి రెడీ అంటారు..గిట్టనోళ్లు రౌడీలనొచ్చు కానీ..వీళ్లు మాత్రం ప్రత్యర్దుల పాలిట సింహాలే..(గ్రామ సింహాలని ఇప్పుడంటున్నారు) అంతెందుకు తమకి నచ్చని పని చేస్తే..సొంతోళ్లని కూడా వదలకుండా బాదేసే ఘనులు..(అసలు అందుకనే 2019 ఎన్నికలలో జనం ఈడ్చి తన్నారంటున్నారు) అంత వీరాధివీరులు ఇప్పుడు కన్పించకుండా జంప్

ఒకళ్లేమో నీయ....ఏమనుకుంటున్నార్రా మావాళ్ల పని చూడకపోతే పుచ్చలు పగులుతాయ్..అసలు నీ సీట్లోనే కూర్చుంటా ఏం చేస్తారంటూ రంకెలు వేసి..తీరా చిన్న కేసు పెట్టగానే వారం రోజులనుంచి పరార్..పైగా సొంతపార్టీ నేతలతో " మా ఇళ్లలో లేడీస్ పైన దాడులు చేస్తున్నారు..భయపెడుతున్నారు..ఇది అరాచకం దుర్మార్గపు పాలన  " అంటూ హాహాకారాలు పెట్టించడం ఒకటి...

ఇక రెండో లీడర్ నోటికి అద్దూ అదుపూ ఉండదు..చేయ్యెత్తితే ఎవుడో ఒకడికి మూడిందన్న రేంజ్ లో మాటలు పేల్చుతుంటాడు..ఇప్పుడు చూస్తే..ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా కన్పించకుండా తిరుగుతున్నాడట..50 కేసులున్నా చింతలేకుండా హాయిగా మన్ను తిన్ను కొండచిలువలా పడుకోగల సమర్ధుడు..
ఇంతటి ఘనులు మరి ఎందుకు బాబుగారి హయాంలో అంత ధైర్యవంతులుగా సవాళ్లు విసిరారు..ఇప్పుడేమో అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు..ఆ...కేసులు పెడుతున్నారు లోపలేస్తారనా...ఆహా...మరి..మీరు జైల్లో పెట్టినా భయపడేది లేదనే..రొటీన్ డైలాగులు ఎందుకు వేస్తున్నారు...హా...ఓహో...ఎటూ ఎవడూ పట్టుకోడని నమ్మకం ఉన్నప్పుడే అలాంటి డైలాగులేస్తారా..మరిప్పుడు..?

Comments