అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్యలో ఆర్టీసీ


ఒకరేమో మొండి అంటారు..మరొకరేమో జగమెరిగిన జగమొండి..ఒకరు అసలు జనంలోకి రావడమనే మాట ఏ ఎన్నికలప్పుడో తప్ప ఈ మధ్యకాలంలో కన్పించడమే మానేసారు..ఇంకొకరేమో ఛాన్స్ దొరికిన ప్రతిసారీ జనంలోనే కన్పించాలనుకుంటారు..ఐనా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ కలుసుకోవడంలో ముందుంటున్నారు..ఐతే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ..వేదిక ఏదైనా కలవడం గ్యారంటీ..ఐతే ఈ ఇద్దరి మధ్యా తేడాని ఆర్టీసీ స్ట్రైక్ స్పష్టంగా పట్టిస్తోంది

ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసి..యాభైవేలమందికి ప్రభుత్వ ఉద్యోగుల హోదాతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత ఏపి సిఎం జగన్ దక్కించుకుంటే..ఎకాఎకిన 45వేలమందిని ఊడబెరికేసాం పొండంటూ భయపెడుతోన్న ఘనత కేసీఆర్‌ది( వాస్తవానికి ఇది బెదిరింపేనంటారు..) ఐతే ఇదేంటనేది ఓ వారంరోజుల్లోకానీ క్లారిటీ రాదు..కానీ ఇలా స్ట్రైక్ చేయడమనేది ఆర్టీసీ ఎంప్లాయిలకు కొత్తకాదు..దానికి ఈ రేంజ్ లో సిఎం స్పందించాల్సిన అవసరం లేదు..
చెప్పిన మాట వినలేదు కాబట్టి..తీసేస్తాం...మీరు ఆందోళనలు కూడా చేయడానికి వీల్లేదంటే..ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేక ఎవడబ్బ జాగీరా అనే కామెంట్లు విన్పించడంలో ఆశ్చర్యం ఏముంది..ఇది ఎంత నష్టం చేకూర్చుతుందో..అంచనా వేయకుండానే కేసీఆర్ ఇలాంటి వైఖరి తీసుకున్నారా..కానీ మధ్యలో జనమే నలిగిపోయారు..ప్రవేట్ ఆపరేటర్లు పండగ చేసుకున్నారు..జనమేమో పండగకి ఊరెళ్లి గుల్ల అయ్యారు..

ఈ సమ్మెపట్ల సిఎం కేసీఆర్ వైఖరే..జగన్ తో పోల్చుకుని చూసినప్పుడు ఎవరికి ఎలాంటి మార్కులు వేయొచ్చో క్లియర్ గా అర్దం అవుతుంది..

Comments