వాహ్..సూపర్ సార్ ఐడియా వర్కౌటైంది..50వేలమందిలో 12మంది డ్యూటీ ఎక్కారు..రేపటికి అంతా


ఓ చానల్ తాలుకూ భజన ఇలానే ఉంది...మద్యాహ్నానికి పన్నెండు మంది..పన్నెండుమంది..పన్నెండుమంది డ్యూటిల్లో జాయినైపోయారు..మంచి తరుణం మించిపోవను..ఇక మీ ఉద్యోగాలు ఎవరూ తీయరు..మీరే తీసుకుంటారు మంగళవారం లోపు జాయిన్ అవకపోతే...ప్లీజ్ జాయినవ్వండి అన్న రేంజ్ లో వార్తలు చదువుతూ ఓ యాంకర్ పడిన తిప్పలు చూస్తే నవ్వొస్తోంది..

50వేలమంది ఉద్యోగులలో 12మంది డ్యూటీలో జాయినైపోయారనేది వార్తగా ఇస్తేనే గురువుగారి పరువు తీసినట్లు..అంతేకానీ..అదేదో ఇచ్చేసి దాంతో చూసారా అందరూ జాయినైపోతున్నారు మీరు కూడా జాయినైపోండి అని లాగడానికి లేదు..అసలు ఇదెక్కడ దాకా పోతుందో కానీ...ఓ నోట ప్రవేట్ రూట్లని డిసైడ్ చేసినతర్వాత ఈ తేసేయబడిన లేదా సెల్ప్ డిస్మలస్ ఉజ్జోగులు లేకుండా ఆ రూట్లలో తిప్పడానికి జనం కావద్దా..హఠాత్తుగా 5వేల రూట్లలో బస్సులు తిరగడం అంటే కనీసం ట్రిప్పుకి ఇద్దరేసుకున్నా...పదివేలమంది ఉజ్జోగస్తులు కొత్తగా కావాల్సిందే వాళ్లంతా ఎక్కడనుంచో ఊడిపడరు కదా...

అలాంటప్పుడు బెదిరింపులెందుకు హాయిగా బాబూ మీ ఉజ్జోగాలు మీరు చేస్కోండి..అంతేకానీ స్ట్రైకులెందుకు ఇక చర్చలేం లేవ్..ఎవరు ఎప్పుడు వస్తే అప్పుడ ు జాయినైపోండని ఓ ఆఫర్ పడేస్తే చాలదా...అనవసరపు పంతాలు..సాధించేదేం లేకుండా డ్యూటీ ఎక్కితే పక్కనోడు నవ్వుతాడని కాదా..ఈ పట్టుదల.అందుకే ఇక చాలు బాబూ..స్ట్రైక్ ఆపేయండి..మీకు ప్రభుత్వం పైన కసి ఉంటే...ఇంకెప్పుడైనా తీర్చుకోండి

Comments