తెలుగుపై ఎక్కడలేని ప్రేమ..లేని ప్రేమటయ్యా.....లోకేశ్..పవన్..బాబు..వెంకయ్యా!?


ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉంటే తెలుగు చనిపోతుంది..మాతృభాష మృత భాష అవుతుంది.. ఈ వాదన
పార్టీలకతీతంగా ఎప్పటికప్పుడు విన్పిస్తుంటారు..ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు..ఐతే నిజంగా అది
జరుగుతుందా..ఎందుకంటే..ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు తెలుగులోనే బోధన చేస్తుంటాయి కాబట్టి..కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఇదే మాధ్యమంలో బోధన అంటే...పరిస్థితి వెంటనే లేదు కానీ...తర్వాత తర్వాత ఖచ్చితంగా తెలుగు ఉండదు అంటున్నారు..ఈ వాదన కరక్టేనా...?

కరక్టే అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి..ఎందుకంటే..మాట్లాడే భాషని ఎవరూ చంపలేరు..మాతృభాష కాని పరాయి భాషని మాతృభాషలాగా ఎవరూ మాట్లాడలేరు..రాయలేరు..చదవలేరు..ఇది ఖచ్చితం..కానీ పాఠశాలల్లో కూడా తెలుగు విన్పించకపోతే కన్పించకపోతే ఎలా..? దానికి సమాధానం తెలుగు భాష ఓ తప్పనసరి అంశం చేయడం..కానీ ఇది జరుగుతుందా..ఎవరు చేసారన్నది కాకుండా..ఏం చెప్పారన్నదే తీసుకుంటే పార్టీల ఆందోళనలో అర్ధం ఉంది..కానీ అది పూర్తిగా కాదు..

ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించారు సరే..మరి దానికి పరిష్కారం కూడా సూచించాలిగా...అది లేకుండా ఎలా అందుకే పవన్ కల్యాణ్, లోకేశ్, చంద్రబాబు, వెంకయ్య ఆందోళనపై ఎవరికీ సానుభూతి లేదు..తెలుగు మీడియంతో పాటు..ఇంగ్లీష్ మీడియం సెక్షన్ కూడా పెట్టాలి..అప్పుడే అది కావాలన్నవాళ్లు దానికి..ఇది కావాలన్నవాళ్లు దీనికి వెళ్తారు..ఈ మాత్రం ఐడియా కూడా ఇవ్వకుండా జగనేదో మహా పాపం చేసినట్లు మాట్లాడొద్దు..కానీ తెలుగు మీడియం ఉండాల్సిందే..దీన్ని పూర్తిగా తీసేయడమంటే మాత్రం
కుదిరేపని కాదు..అందుకే ఈ అంశంపై వీలైనంత చర్చ జరగాలి..
మా మటుకు మేం పది వరకూ తెలుగు మీడియమే..తర్వాత  అంతా ఇంగ్లీష్ మీడియమే...కానీ ఏమైంది..ఏమైనా మాకు పరభాషలో పట్టాలొచ్చాయా...లేదు..కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివినవారికంటే ఎక్కువే ఇంగ్లీష్ మాట్లాడగలం..అలానే తెలుగులో ఇప్పటి ఆచార్యుల కంటే ఎక్కువే తప్పులు లేకుండా రాయగలం..(వ్రాయగలం)..అలాంటప్పుడు అమ్మభాష ఆత్మీయత అయితే ఆంగ్లభాష అవసరానికి అని ఎప్పుడూ రొడ్డకొట్టుడు డైలాగ్ వల్లించే వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని గమనించాలి..

మంచి సలహాలు ఇచ్చి ఇంగ్లీష్ కూడా నేర్చుకునేలా చేయాలి..ఆ ఇంగ్లీషే లేకపోతే..ఈ హైటెక్ సిటీలు..సత్యనాదెళ్లలు కన్పించేవా మనకి..ఇక్కడ కామెడీ ఏంటంటే లోకేశ్ బాబు అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ఏదీ సరిగా పలకలేడు..పవన్ బాబుగారు గర్జనలే తప్ప ఆయన పరిజ్ఞానాన్ని పరిశోధించలేం..అలాంటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగుని ఖూనీ చేస్తున్నారని బాధ పడేదేంటి..చేతనైతే మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించలేని మనం..జనాల కోసం బాధపడుతున్నట్లు బిల్డప్ ఇవ్వొద్దు..అంటే నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదు అని ఓపెన్‌గానే
చెప్తున్నారా...మీరంతా..!

Comments