పవన్ నాయుడూ ఇదేం తీరు..పేర్ని నాని ప్రశ్న..పవన్ కౌంటర్


పవన్ కల్యాణ్ క్లోజ్‌గా జగన్ ని అందులోనూ ముఖ్యమంత్రి జగన్‌ని ఫాలో అవుతున్నట్లు ఇవాళ్టి కౌంటర్ చూస్తే అర్దమైపోతుంది..నాకు మూడు పెళ్లిళ్లైతే ఏంటి..మీరు కూడా చేసుకోండి ఎవడు కాదన్నాడు అంటూ చప్పగా ఆయన
ఎదురు ప్రశ్న చూస్తే..పవన్ కల్యాణ్ తెలుగు మీడియం తీసేసి..ఇంగ్లీష్ పెట్టాలన్న అంశంపై వెనక్కి తగ్గినట్లే కన్పిస్తోంది..
అందుకు ఆయన మాట్లాడిన తీరే ఉదాహరణ..నేనేం ఇఁగ్లీష్ వద్దనడం లేదు..ఒకేసారి టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వకుండా..ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్లెలా చెప్తారు అంటూ సాగదీశాడు..ఇదీ అసలు ముందు రోజు స్పందించాల్సిన తీరు..నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అన్న మౌలికమైన ప్రశ్నని వదిలేసి..పెళ్లిపై కామెంట్ చేసాడంటూ విలపించడం ఎందుకు..జగన్ చేసింది తప్పే అని ఓ సెకన్ అనుకున్నా...వెంటనే ఆ స్పీచ్‌లోనే జగన్ పై వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తే..మీ కామెంట్లకి విలువ ఎక్కడ ఉంటుంది..

అంటే మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి..డబ్బూ దస్కం లేక అవస్థలు పడేవాళ్లు మాత్రమే తెలుగుని బతికించాలి..తెలుగువెలుగులను విరజిమ్మే బాధ్యత ఒక్క మధ్యతరగతి పేద వర్గాలదే అన్నమాట..అంతెందుకు దమ్ముంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎంతమంది వారి పాఠశాలల్లో ...బయట స్కూళ్లలో చదువుతున్నారో లెక్కలు తీయండి..అప్పుడు మీ వాదనకి జనంలో మద్దతు ఉందో లేక ప్రభుత్వం వాదనకి మద్దతు ఉందో తెలుస్తుంది

అందుకేగా..పేర్ని నానితో మీకు కౌంటర్ ఇప్పించింది..పవన్ నాయుడూ మీరు అచ్చె..నారా...చంద్రబాబునాయుడు చెప్పినట్లు మాట్లాడుతున్నారు అని అనడంలోని అసలు అర్దం మీకు తెలీదా...ఎందుకు సర్..ఇక  ఎల్లుండి చంద్రబాబుగారి ఇసుక గర్జనలో కలిసిపోండి జనం పిచ్చపిచ్చగా వస్తారు..మీరూ నాలుగు అరుపులు అరిచి సైలెంటైపోవచ్చు..ఇంగ్లీష్ లో తెలుగుకి మద్దతుగా ట్వీట్లు పెట్టొచ్చు

Comments