కోర్టు చెప్పినా వినరా..సాగదీయడమే సిఎం టార్గెట్టా!


మనకే అన్నీ తెలుసు..ఎవడేం చెప్పినా వినను..ఈ ధోరణి ఓ దెబ్బ తగిలేంతవరకూ బానే ఉంటుంది. ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిలాగా..నేనేం తప్పు చేశానో చెప్పండి..నాకిప్పటికీ అర్ధం కావడంలేదు జనం నన్ను ఎందుకు ఓడగొట్టారో అంటూ వాపోవాల్సి వస్తుంది..ఇప్పుడు పొరుగు రాష్ట్రం అధినేత బిహేవియర్ కూడా ఇలానే
ఉంది..నెల రోజులు దాటింది స్ట్రైక్ జరుగుతూ..ఐనా మాకేంటి.. అనే ధోరణిలోనే సాగుతున్నాడాయన. 

కోర్టేమైనా కొడతదా...ఈ కామెంట్ చాలు..ఇగో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి..ఇప్పుడా కోర్టే..బాబూ అలాక్కాదు నాయనా ఇలా చేయండి..ఓ  కమిటీ అయినా వేయనీయండి..దాంతో రెండు వర్గాల ఇగోలు పక్కనబెట్టి ఓ సొల్యూషన్ దొరుకుతుంది అని ఓ సజెషన్ ఇస్తే...
ఛత్..మీకేం తెలుసు..ఈ కేసు ఆ కోర్టుకి పోద్ది..ఈడకి పోద్ది మీకెందుకు మీరు చెప్పినట్లు మేమెందుకు వెళ్లాలంటూ అఫిడవిట్ వేయడం చూస్తుంటే..కావాలని ఈ వివాదం రగులుతూనే పోవాలి..విసిగి వేసారి వాళ్లే కాళ్ల బేరానికి వస్తారనే కదా..అసలు ఉద్దేశం

ఐతే అకారణంగా ఓ చిన్న ప్రాణి బాధపడితేనే..ఆ బాధకి కారకులకు ఉసురు తగిలి తీరుతుంది..అలాంటిది. ఇన్ని వేలమంది తిట్టుకుంటుంటే ఆ సెగ తగలకుండా పోతుందా..

Comments