వల్లభనేని వంశీ మోహన్ దుర్లభమైన పంచ్ వేశాడబ్బా తట్టుకోవడం ఎలా బాబూ


వర్ధంతికి..జయంతికి తేడా తెలీనివాళ్లు కూడా మమ్మల్ని విమర్శిస్తుంటే పడాలా...?
ఇది పాపం వంశీ వేసిన పంచ్‌లలో  అతి పెద్దదిగా అన్పించడంలో తప్పేం లేదు..వాస్తవానికి ఇది ఆయన ఒక్కడి బాధ కాదు..టిడిపిలోని చెంచాగిరీ చేయలేని..భజన చేతకాని చాలామంది సీనియర్లు..జూనియర్లు..కార్యకర్తల ఆవేదన..ఎందుకంటే..పాతికేళ్లు ముఫ్పై ఏళ్లుగా ఓ పార్టీలో నానా చాకిరీ చేస్తూ..పవర్ లో లేనప్పుడు అవతలి పక్షం వారి విమర్శలను..కేసులను..అన్నిటినీ తట్టుకుంటూ నెట్టుకొచ్చేవారికి సడన్ గా ఓ వంశాకురాన్ని తీసుకొచ్చి ఈయనే మీ నేత అంటే ఎలా ఉంటుంది..పైగా సదరు వంశాంకురం...పార్టీ నాశనానికే తప్ప..పవర్‌గా పనికిరాకపోతే...
కడుపు మండదా..దానికి తోడు భజన బ్యాచ్ తాము చెడుతూ..ఇతరులను కూడా చెడిపొమ్మంటే చెల్లుతుందా..

విజయం అందరిదీ..పరాజయం మాత్రం అనాధ..మరిలాంటి నాయకత్వాన్ని ముందుకు తోసి పరాజయం పాలైతే...ఏ లీడర్ కి మండదు..అదే ఇప్పుడు బైటికి వచ్చిందనుకోవాలి...

లోపల అనుకోవచ్చు..ఆ..ఇవన్నీ మామూలేలే...అదే గెలిస్తే నన్నూ నా బిడ్డనీ తెగ పొగిడేవారు కాదా అని..ముమ్మాటికీ పొగడరు..ఓ లీడర్ శక్తి సామర్ద్యాలేంటో జనంలోక ివస్తే తెలిసిపోతుంది..ఓ వేళ జనంలో మెయిన్ టైన్ చేసినా..వారి అసలు నైజం దగ్గరగా ఉండే లీడర్లకి తెలీకుండా ఉంటుందా..దీనికేదో ఫిరాయింపు రాజకీయాలను కుని కవర్ చేసుకుని విమర్శలకు దిగినంత మాత్రం ఏమైపోతుంది..రేపొద్దున్న ఇతగాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..తిరిగి అక్కడే టిక్కెట్ తెచ్చుకుని గెలిస్తే కదా...అసలు మజా...

ఇంకా వంశీ ఒక్క మాట కాదు...బోలెడన్ని అడిగేశాడు...సెటిల్డ్‌గా..సూటిగా సుత్తి లేకుండా..ఎందుకు ప్రతి ఎన్నికకి ముందు ఎవడో ఒకడితో కలిసి పోవడం..తర్వాత వాడిని తన్నడం అని..సమాధానం ఉఁదా మరి..
ఈ కింద వీడియో చూడండి..10 టివి వీడియో ఇదిhttps://www.youtube.com/watch?v=BrralR39RH8
https://www.youtube.com/watch?v=BrralR39RH8

Comments