హేయ్ చంద్రన్న మళ్లీ ఏసేశారు..! ఈసారి డిజిటల్ కరెన్సీ


చంద్రబాబుగారు ఓ పట్టు పడితే అది సాధించిగానీ నిద్రపోరు..ఇది చాలా సందర్భాల్లో ఋజువు చేసుకున్నారు కూడా..అప్పుడెప్పుడో బిల్ గేట్స్‌కి పాఠాలు నేర్పడంలో కానీ..తర్వాత సత్య నాదెళ్లని అమెరికాకి పంపడంలో కానీ..బ్లాక్ మనీ కోసం నోట్లరద్దు చేయించడం కానీ.. తర్వాత తుఫాన్లను ఎదుర్కోవడంలో కానీ..బ్రిటీషర్లపై పోరాడటంలో కానీ..శారదాపీఠం దగ్గర సిసి ఫుటేజ్ తీయించడంలో కానీ ఆయనకి ఆయనే సాటి..వెటకారంగా అన్నా కూడా ఆయన ఓ పని అనుకుంటే అయిందాకా వదిలిపెట్టరు..అనుకున్న ప్రాజెక్టులను రాష్ట్రంలోకి రప్పించడం వరకూ ఆయనకి తిరుగులేదు..వాటిపై ఆరోపణల సంగతి పక్కనబెడితే..అలానే పబ్లిసిటీ రావాలంటే ఏం చేయాలో..అన్ని చానళ్లూ ఏ సమయానికి లైవ్ ఇవ్వగలవో కూడా ఆయన చేసే వైల్డ్ గెస్ ఎప్పుడూ తప్పదు

అలాంటి చంద్రబాబుగారు ఇప్పుడో పంచ్ పై పంచ్  వేసేసారు..అదేంటంటే..
పంచ్ నంబర్ 1 - రాజకీయాల్లో డబ్బు సంచులు ఎక్కువైపోయాయ్...సూట్ కేసులు పట్టుకుని రావడం ఎక్కువైంది..నిజంగా సేవ చేసేవాళ్లు రావాలంటే భయపడుతున్నారు(ట)
పంచ్ నంబర్ 2- డబ్బు ప్రభావం తగ్గించాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి
పంచ్ నంబర్ 3- ప్రతిపక్ష హోదా జనం ఇస్తే వచ్చింది..కాపాడుకోవడం నాకు తెలుసు
రాజకీయాల్లో డబ్బు ప్రభావం గురించి టిడిపి మాట్లాడటం చాలా కామెడీ..అందులోనూ ఎన్నికలకు ముందు కొత్తవాళ్లు డబ్బులతో దిగుతున్నారని  వాపోయేముందు మన పార్టీ అలా ఎన్నిసార్లు చేసిందో  గుర్తు లేదా..పైగా పార్టీలో ఈ డబ్బురాయుళ్లు ఎక్కువయ్యారనే కదా..చాలామంది టిడిపి టిక్కెట్ల కోసం అర్హత ఉన్నా..వెనక్కి పోయి సైలెంట్ గా వాళ్ల పని వాళ్లు చూసుకుంటున్నారు
డబ్బు ప్రభావం పోవడానికి డిజిటల్ కరెన్సీ తీసుకురావడం ఏంటో ఆయనకే తెలియాలి..ఎందుకంటే ఇప్పటికే పేటిఎం, గూగుల్ పేతో పాటు యూపిఐ ట్రాన్సాక్షన్స్ కూడా వందకోట్ల నంబర్‌ని చేరాయ్..ఇంకా డిజిటల్ అంటే ఏంటీ ఆయన ఆర్ధం..ఓహో బిట్ కాయిన్ లాంటి కరెన్సీ రావాలంటారా...సరే బాబుగారూ కొంపదీసి మోడీ కానీ తొందర్లో డిజిటల్ కరెన్సీ తెస్తాడని లీక్ కానీ అందిందా ఏంటి..ఎందుకంటే అప్పట్లో డీమానిటైజేషన్ దెయ్యానికి ముందే కదా మన యాపారాన్ని బిగ్ బజార్ కిషోర్ బియానీకి అమ్మకం చేశాం...అయినా డిజిటల్ కరెన్సీలు వస్తే..ఇప్పుడున్నంత సేఫ్టీ కూడా ఉండదని కరెన్సీ ఎక్స్ పర్ట్స్ సైబర్ ఎక్స్ పర్ట్స్ చెప్తుంటే..టెక్ కింగ్ మీకు తెలియకపోవడం ఏంటండీ..ఆ ఏంటిది..!

Comments