గుజరాత్‌లోనూ నిత్యానంద రాసలీలలు...బురిడీ బాబా


అయ్యగారి వయసు చూస్తే 41...దేశం మొత్తం గురుడి లీలలు తెలుసు...రంజితతో నిత్యానందం పొందుతూ కన్పించిన వీడియోనే ఇందుకు రీజన్..ఆ తర్వాతేమైనా తక్కువ తిన్నాడా...ఆశ్రమంలోని లేడీస్‌ని బలవంతంగానో...అంగీకారంతోనో మస్త్ గా ఎంజాయ్ చేసి బొక్కలో పడ్డాడు..ఇప్పుడు మరోసారి గురుడు గుజరాత్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడని..జంపై పోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోయారు..ఇంతకీ అతగాడు ఉన్నాడా..జంప్ అయ్యాడా...

తిరువణ్ణామలైలో పుట్టిన నిత్యానంద అసలు పేరు ఏ.రాజశేఖరన్ అక్కడే స్కూలింగ్ పూర్తి చేసి....గుడియాట్టమ్‌లోని  కాలేజ్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు..ఆ తర్వాత ఏమైందో ఎహ..ఈ చదువులేంటో అనుకున్నాడో కానీ...ఆ తర్వాత ఐదారేళ్లకే స్పిరిచ్యువల్ గురుగా మారాడంటారు...గుడిసేటి ఏకాంతం మనిషిని..యోగిని కానీ..భోగిని కానీ చేస్తుందంటారు..ఇతగాడు యోగిగా మారిన భోగిగా మారినట్లున్నాడు..అందుకే 32ఏళ్లకే లైంగికపరమైన వివాదాల్లో చిక్కుకున్న గురుగా..కన్పించాడు...బిడది ఎప్పుడు చేరాడో ఏమో కానీ...రంజితతో శృంగారం చేస్తోన్న వీడియో ఎవరు ఎలా ఫిక్స్ చేసారో కానీ..ఇప్పుడసలు నిత్యానందకి ఎలాంటి పరిచయం అక్కర్లేదు..

గుజరాత్‌లో ఓ ఆశ్రమం అందులోనూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి గొప్ప సంస్థ ఆవరణలో పెట్టడం అందులో స్కూల్ నడపడం..దానికి సీీబీఎస్ఈ పర్మిషన్ ఇవ్వడం..అంతా సిస్టమ్ లోని లోపాలే...ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టేందేంటి..ఏది కావాలంటే అలా..జీవించడమే ఆశ్రమాల్లో దొరుకుతుంటే..ఇక ఇంటికి వెళ్తామని ఎందుకు అంటారు..దానికి తోడు భంగు..గింగులాంటివి బోలెడు ఉంటాయ్..మత్తులోనే జోగేందుకు..ముందిలాంటి ఆశ్రమాలకు వెళ్లేముందే ఆలోచించాలి..ఇది కరెక్టా కాదా అని...నిజంగా నిత్యానంద జంప్ అయ్యాడా...లేదు లేదు నార్తిండియాలోని ఏదోక మఠాల్లో తిరుగుతుంటాడనడంలో సందేహం లేదంంటున్నారు కర్నాటక పోలీసులు..ఎందుకంటే..అతగాడి పాస్ పోర్ట్ రద్దైపోయిందట..ఏం వేరే మార్గాలు లేవా..అందులో సాములోరికి..ఓ మాయ చేస్తే సరి నకిలీ పాస్ పోర్ట్ రాదా

Comments