టచ్ చేసి చూడు..టచ్‌లో ఉన్నారు..టచ్ లో ఉంటే చెప్తా..ఏంటబ్బా ఏపీ పాలిటిక్స్


ఎహ..మీకు తెలీదు...ఆల్రెడీ ఏపీలో పెద్ద భూకంపం రాబోతోంది..పెద్ద కుదుపు రాబోతోంది..వాళ్లలో చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు..ఇది ఓ టిడిపి ప్రతినిధి పోయిన వారం వాగుడు...నిజ్జంగా వాగుడే మరి..లేకపోతే...ఏం  ఆశించి ఆ పార్టీలో జేరతారు...
దానికి ముందు ఓ సత్రకాయ..హలో మాతో టిడిపి వాళ్లు టచ్‌లో ఉన్నారు..కానీ మేం ఎవరిని పడితే వాళ్లని చేర్చుకోం..కేంద్రంలో మా పార్టీ నిర్ణయం ప్రకారం పోతాం...అసలు ప్రతిపక్షంలో ఉండేందుకు..ఏ రాయైతేనేం...

ఇప్పుడిక వైఎస్సార్సీపీ ఎంపిలు మాతో టచ్ లో ఉన్నారంటూ సుజనావారి పలుకులు వక్కపలుకుల్లా జగన్ మంత్రులకు తగలడంతో ఏకంగా పార్టీ ఎంపీలంతా దండయాత్రకి దిగారు..ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారో దమ్ముంటే చెప్పు..నీ సంగతి చూస్తామంటూ సవాళ్లు విసిరారు..

ఐనా ఈ టచ్ చేసి చూసే పాలిటిక్సేంటంట..అప్పుడంటే చంద్రబాబుగారికి 103 సీట్లు..వాళ్లలో 40మంది జంపైతే ఎలాగనే భయం పట్టుకోవడంతో ఓపెన్‌గానే లాగేసారు..వైఎస్సార్సీపీకి అవసరమే లేదు..వస్తామంటే రాజీనామా చేసి రావచ్చనేది ఓపెన్ ఆఫరే..ఇక మధ్యలో బిజెపి ఉడత ఊపులకు ఎవరు భయపడాలి..అందుకే టచ్ చేస్తే..ప్రగల్భాలే తప్ప ఇంతవరకూ కొత్తగా ఎవడూ జంపైంది లేదు..బై ఎలక్షన్లు వచ్చిందీ లేదు

Comments