ఎన్‌సిపిని వదిలే ప్రసక్తే లేదు..దాంతో కలిసేదే లేదు..ఇప్పుడేమంటావ్ దేవేంద్రా


అవినీతిమయమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ నేతలను వదిలే ప్రసక్తే లేదు..ఇది 2014లో మాట

ఎన్‌సిపిని వదిలేది లేదు..వారు మాకు మద్దతు ఇచ్చారు-ఇది ఇప్పటి మాట
అధికారం కోసం ఎవరినైనా కావలించుకోవడమే రాజకీయమైతే..అందులో  బిజెపికి పిహెచ్డీ ...దేవేంధ్ర ఫడ్నవీస్ కి గోల్డ ్  మెడల్ ఇవ్వాల్సిందే..ఎందుకంటే..బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ తో తప్ప అందరితోనూ రెండు మూడుసార్లు అలయన్స్ అయిపోయింది.ఇక అపవిత్ర పొత్తు అంటూ షా మోదీ కూసే కూతలకు వేల్యూ ఎక్కడుంది..ఇప్పటికే లేదని చాలామంది నిశ్చితాభిప్రాయం..

ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసిన పార్టీ నమ్మక ద్రోహం చేస్తే..మరి బిజెపి మాత్రం ఏం చేసినట్లు..పైగా శివసేన సిఎం సీటు ఇస్తే కలుస్తామని మాత్రమే చెప్పింది..ఆ మాట మీరు చెప్పకుండానే...అదే పని చేసారు..మధ్యలో బుక్కైంది..మన మరాఠా యోధుడు శరద్ పవార్..80ఏళ్ల వయసులో వానలో తడుస్తూ పార్టీని గెలుపుబాటలో సగం తీసుకొచ్చిన శరద్ పవార్ కి ఈ శాస్తి జరగాల్సిందేనా...

లేక భవిష్యత్తులో ఏదైనా పెద్ద పదవి ఆయన కోసం ఎదురు చూస్తుండగా..ఇదో  మహానాటకంలో అంతర్నాటకమా...బురదలో  తామర పుట్టినా...వికసించినా...కంపు కామనేగా..

Comments