పవర్ ప్లే ఆడిన శరద్..డంగైపోయిన ఫడ్నవీస్..చంద్రబాబూ ఇదేమైనా పనికి వస్తుందా మనకి



ఎనభై ఏళ్ల వృధ్దుడు...ఐతేనేం మనసు పెట్టి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు..అందులోనూ దేశంలో బిజెపికి మోదీ షాలకు అసలు ఎదురే లేదని అనుకునేవారికి తన సత్తా మరోసారి చాటాడు..రాజకీయం ఎవరైనా చేయవచ్చని..గెలుపు...పై ఆట ఎవరి సొత్తూ కాదని ప్రూవ్ చేశాడు..పైగా చీలిక అంచులో ఉన్న పార్టీని తిరిగి ఒక్క పిలుపుతో గాడిలో పెట్టాడు..ఇలా ఎమ్మెల్యేలను..గ్రిప్ లో పెట్టుకునేది పార్టీని కాపాడుకునేది అని చెప్పి మరీ చేసాడు

రేపొద్దున్న మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఉండొచ్చు ఊడొచ్చు కానీ...నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని గట్టుమీద ఉంచడంలో..ఎమ్మెల్యేలను అవతలిపార్టీ వాళ్లు లాగేయకుండా ఉండటంలో శరద్ పవార్ పెద్ద సంకేతాలే పంపారు..ఇది ఏపీలో టిడిపికి..తెలంగాణలో కాంగ్రెస్ కి ఆ మాటికి వస్తే ప్రతి రాష్ట్రంలో జంప్ జిలానీల బాధతో చతికిలబడిన ప్రతి పార్టీకి ఓ డైరక్షన్ ఇచ్చాడు..ఇలారా బాబూ పార్టీని నడిపేదని చూపించాడు

రాత్రికి రాత్రి గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించడం..ఎత్తేయడం బిజెపికే తెలిస్తే..దానికి విరుగుడు ప్లాన్ వేయడం తమకీ వచ్చిన మరాఠా వీరుడు నిరూపీించాడు..ఐతే ఇక్కడ చూడాల్సింది ఒక్కటే మహారాష్ట్రలోనూ ఇక ప్రాంతీయతత్వం పెరగబోతోంది..ఇప్పటిదాకా ఇది అండర్ కరెంట్ గా ఉంటే..ఇప్పుడది బైటికి వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన దగ్గర్నుంచి కూడా  అంతా శరద్ పవార్ చుట్టూనే తిరిగారు..సలహా కోసమో..మద్దతు కోసమో..ఈ రోజుకి కూడా పవార్ జీ అంటూ సంబోధిస్తున్నారు..వాజ్ పేయ్ లానో..అద్వానీలానో మూలనపెట్టలేదు..మరాఠాల ఐక్యతే ఈ కూటమికి నాంది పలికిందన్నా అతిశయోక్తి కాదు..

Comments