ఉద్దవ్ ఠాక్రే చంద్రబాబునెందుకు పిలవలేదు


ఎన్నికలకు ముందే బిజెపితో స్నేహం కుదిరిన సమయంలో ఉద్దవ్ సారీ..మహారాష్ట్ర సిఎం ఓ మాట చెప్పాడు..మేం అధికార కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నాం అని..ఈ విషయంలో రిపబ్లిక్ టీవి ఆర్నాబ్ ఇక ఎంత నానాయాగీ చేసినా ఎవడూ పట్టించుకోడు..అధికారం కోసం హిందూత్వాన్ని వదిలేశారా..అంటూ తొక్కలో డిబేట్ లు పెట్టుకున్నా రేటింగులు పెంచుకుంటాడేమో కానీ ముంబై జనం బీపీ పెంచుకోరు..ఐనా ఇక హిందూత్వ అనేది ఎవరి సొత్తూ కాదూ..అయిపోయింద ఆ చాప్టర్...రామాలయం కనుక పూర్తైతే..ఇక బిజెపి చేస్తాం..చేస్తాం  అని చెప్పడానికేం ఉండదు బూడిద తప్ప...కాబట్టి ఆ టాపిక్ వదిలేయడం బెటర్

సిఎం సీటుపై పేచీ బైటికి వచ్చినప్పుడు ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ తో ఎలా కలుస్తారంటే...మరి బిజెపి ఏపీలో చంద్రబాబుతో..బీహార్ లో నితీష్ తో..కాశ్మీర్ లో మెహబూబాతో ఎలా కలిసాడు..ఆయనొక్కడికే అధికారం కావాలి..మాకు వద్దా అంటూ క్వశ్చెన్ చేసాడు..అప్పుడైనా బిజెపి కాస్త వెనక్కి తగ్గితే కనీసం అధికారంలో పాలు బీరు పంచుకునేది..

ఐతే కాంగ్రెస్ లీడర్లని..మమతాబెనర్జీని..కేజ్రీవాల్ ని..సోనియా,రాహుల్..అందరినీ పిలిచిన ఉద్దవ్ ఠాక్రే చంద్రబాబుని ఎందుకు పిలవలేదు..ఈ డౌట్ రాదు కదా..ఎందుకంటే..ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఏ చక్రం లేదు..తిప్పడానికి ..పైగా అతగాడిని పిలిచి..ఎక్కడ కూర్చోబెట్టాలి..కాంగ్రెస్ పక్కనే కదా..ఆ కాంగ్రెస్సేమో ఏపీ తెలంగాణలో బొక్క బోర్లా పడిన తర్వాత బాబు హస్తమంటేనే భయపడుతోంది..పైగా....ఇప్పుడిప్పుడే మళ్లీ మోదీ కౌగిట్లో ఓదార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు..తొందర్లో ఆ ముచ్చటా తీరుతుంది..అందుకే..ఇప్పట్నుంచే ఉద్దవ్ మోడీ మిత్రులను దూరం పెట్టే సిగ్నల్ ఇచ్చేసినట్లే..అంతే మరి..తాత్కాలికంగానైనా..శత్రువుకు మిత్రుడు..మనకి విలనే కదా...

Comments