పవన్ బాబూ మీరుండాలి..అందరి తాటా తీయాలి


మీరు అజ్ఞాతాన్ని వీడి జనం సమస్యల కోసం పోరాడటం భలే హ్యాపీగా అన్పించింది ..కానీ సారూ మీరెంటి ముందు లా....oగ్ మార్చ్ అన్నారు...తీరా చూస్తే...మూడు కిలోమీటర్లు..సరే అదేమంత పని అనుకుంటే..అది కూడా కారుపైనే ఎక్కేసి హ్యాపీగా నడిచేసారు..ఎలా సార్..ఇలాంటి ఐడియాలు మీకు వస్తాయ్...అప్పట్లో జిల్లాల యాత్రలనగానే...నిజంగానే జిల్లాల్లో తిరుగుతారనుకుంటే..ఊర్లలో కూర్చుని కాలు కదపకుండా మొత్తం రాజకీయం తలకిందులు చేసేసారు..ఇప్పుడేమో ఇలా..సరే మాలాంటి బుర్రలేనోళ్లకి మీ ఎత్తులు అర్దం కావనుకోండి

ఐనా పార్టీ పెట్టి నడపడం అంత కష్టమైతే ఎందుకు సార్ అంతగా బాధపడతారు..ఇంతకీ మీకు అంత బాధగా ఉందా గర్వంగా ఉందా..మీ రంకెలు..సారీ అరుపులతో అర్ధం చేసుకోలేకపోయాం..ఓ పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టమో మీకేం తెలుసు..అంటూ వాపోయారు. ఎవరికి చెప్తున్నార్ సార్ ఈ మాటలు..మీ లీడర్లకా..లేక జగన్ కా..విజయసాయిరెడ్డికా..లేక మీ కార్యకర్తలకా...మీరు ఇసుక కొరతతో బాధపడుతున్న లక్షలాది కార్మికులకోసం మార్చ్ చేసారు..వారి గురించి మాట్లాడారు..మరి అంతటితో సరిపెట్టుకోక...తాట తీస్తామంటున్నారే...బాగా తీసారు సార్..పార్టీ పెట్టకముందు నుంచి మీరు ప్రజారాజ్యం ఉన్నప్పట్నుంచి....అటు బాబుగారి తాట తీసారు..వైఎస్ తాటా తీసారు..తర్వాత జనసేనతో 2014లో ఏపీజనం తాట కూడా తీసారు..ఇప్పుడు మళ్లీ తాట తీస్తామంటన్నారు...

హద్దు మీరితే తాట తీస్తామనే మీ డైలాగ్ భలే ఉంది సార్..ఎక్కడ నుంచి ఎత్తారు సార్ అది..ఎందుకంటే..మీరు ఇలా ఎంతమంది తాట తీస్తారో..అంతకు ముందు ఎంతమందిది తీసారో కాస్త లెక్క తెలుసుకోవాలని ఉంది..ఐతే మీరిలా అన్న ప్రతిసారీ..అదేంటో మరి అవతలిపక్షం వాళ్లు భలేగా గెలుస్తున్నారు సర్..ఆ...ఓహో..మీరు గెలుపు కోసం కాదు..వచ్చింది పాతికేళ్లు రాజకీయం చేస్తారు కదా..మర్చిపోయాం సార్..కానీ పాపం మీ ఫ్యాన్స్..మీరు చెప్పే డైలాగ్స్ కి భలే చప్పట్లు కొడుతున్నారు..పనిలో పనిగా పని మానుకుని మీ వెంట నడుస్తున్నందకు వారి తాట కూడా తీస్తారా ఏంటి..చెప్పండి సర్..
ఎందుకంటే ఓ కుటుంబం అంటే ఏంటో...వారి కష్టాలేంటో తెలిసిన మనిషాయె మీరు..పని పాటా వదిలేసి మీరెప్పుడు పిలుపిస్తే..అప్పుడు వచ్చేసే జనం గురించి కూడా కాస్త ఆలోచించండి..మీరు ఆలోచిస్తారు..అందుకే  ఎక్కువగా ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోరు..బహుశా ఇంకో రెండు మూడు నెలల తర్వాతేమో కన్పించేది..లేదంటే మనకి మద్దతిచ్చే పార్టీల మీటింగ్స్ కి వెళ్లమని చెప్పండి

అయ్యా మీరు సినిమాలు చేసుకోవాలంటే చేసుకోండయ్యా..జగన్ కోసం  ఎందుకు మానుకోవడం..ఎటూ మన బాబుగారికి జనరంజకమైన పాలన అందించే సత్తా ఉంది..అంతేకానీ జగన్ గారు సరిగా పాలివ్వడం లేదని..మీరెందుకు సామీ సినిమాలు మానడం?

Comments

  1. జగన్ కోసం ఆయన సినిమాలు మానేయ్యలేదు.
    ఓ కంగారుపడిపోవద్దు.

    ReplyDelete
  2. పవనయ్యా. అందరి తాట తీయడానికి నీవు ఎవరు స్వామీ. ఎందుకు ఈ అర్థంలేని హంగామా చేస్తావు. దయచేసి మీ ఆవేశాన్ని తగ్గించుకుని మంచి సినిమాలు నటించు. నీలో చక్కని నటుడున్నాడు. ఉదా. గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, అత్తారిం టికి దారేది, గోపాలా చిత్రాలు. పరిణితి చెందిన పాత్రలలో నటించు.
    ఎందుకు ఈ పూనకం ప్రసంగాలతో అభిమానులను గందర గోళం చేస్తావు.

    ReplyDelete
    Replies
    1. కొత్తగా తోళ్ళ వ్యాపారం మొదలెట్టాడ్లే... వైసీపీ తోలుకి గిరాకీ ఎక్కువంట.. తేదాపాది పనికిరాదంట.. అదీ ఆయన గోల.

      Delete

Post a Comment