పాపం జేసీ దివాకర్ రెడ్డి..అటు జగన్ రమ్మనడు..బాబు పొమ్మనడు


జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు జంక్షన్ లో జవరాలు..కాదు కాదు..జంక్షన్‌లో ముసలి జవ్వని..ఈయనకి రాజకీయాలపై ఆసక్తి చచ్చిపోయింది నాకు నమ్మండి బాబూ అంటాడు..కానీ మనసులో ఏదోలా మళ్లీఓసారి మంత్రి పదవి దొరికితే నా సామి రంగా అనిపిద్దామనే ఉంది..క్లియర్ గా కన్పిస్తుందా సంగతి..ఎక్కడా  ఒప్పుకోడు...

నిజంగా వైఎస్ జగన్ రమ్మనాలే కానీ..ఏ అడ్డంకులూ లేవతనికి..పోవడానికి..కానీ జగన్ పిలవనే పిలవడు..కనీసం అతనున్న సంగతైనా గుర్తించడంలేదు..దీంతో అడ్డమైన యూట్యూబ్ గొట్టాల ముందూ నానా తిప్పలూ పడుతున్నాడు..చంద్రబాబుపై చురకలేస్తున్నాడు..జగన్ని ఆకాశానికెత్తేస్తున్నాడు..ఐనా అట్నుంచి నో సిగ్నల్..దీంతో అంతలోనే ఫైరేపోతాడు..జగన్ నన్ను బెదిరిస్తున్నాడని ఏదేదో చేయబోతాడు..అంతలోనే నాలుక్కరుచుకని..ఎహా మా బాబు వేస్ట్..శుద్ద దండగ..ఏ నాకొడుకూ..బాబు మాట్లాడుతుంటే..పది నిమిషాలు కూడా ఆసక్తిగా వినడు..ఇంట్రస్టే ఉండదు..ఏదో ఆయనకే అన్నీ తెలిసినట్లు..మేమంతా బడిపిల్లలం అయినట్లు బిహేవ్ చేస్తాండంటూ
వాపోతున్న జేసీని చూస్తే జాలేయకతప్పదు..

కానీ...అటు చంద్రబాబు కూాడా ఏమనడు..పో సామీ నీ కొలువు చాలు అని అన్నా బావుండు..ఏదోరకంగా వైఎస్సార్సీీపీలో జాయినవ్వచ్చు అనుకుంటాడాయన..కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో చంద్రబాబు వెంట లీడర్లే కరువు.. ఏ ఇష్యూలోనైనా జగన్ అరగంటలో ముగించేస్తున్నాడు..ఆఫీసర్లలో మంచి పేరు ఉందని రీసెంట్ గా కూడా కామెంట్ చేశాడు జేసీ..

పైగా చంద్రబాబుగారు మాట్లాడాలంటే..ఐఎఎస్ లను పిలిచి..ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు..ఏ  టీవీలను పిలవాలి వంటివి కూడా చెప్తాడని..ఇలానే ఓడిపోయిన తర్వాత కూడా బిహేవ్ చేస్తున్నాడంటూ బాబుగారి పరువుని సోషల్ మీడియాలో కలిపేశాడు జేసీ..ఇంత కసి ఉన్నా పాపం టిడిపినే పట్టుకుని ఉఁటానని చెప్పడమే అసలు కొస మెరుపు

Comments