ఫిరాయింపు చట్టం ఉందంటూ శరద్ పవార్ బెదిరింపు ఎవడు పట్టించుకుంటాడు?


ఇదిగో జాగ్రత్త...అనర్హత వేటు వేయిస్తా..ఏమనుకున్నారో..నాకున్న 54మందిలో 35మంది పోతే మాత్రం మీకు ఫిరాయింపు నిరోధచట్టం ప్రకారం పదవులు పోతాయ్..అంటూ శరద్ పవార్ పాపం శాపాలు పెడుతున్నాడు...కానీ
ఇవన్నీ జరగడానికి ముందు అక్కడ అసెంబ్లీ లేదు..స్పీకర్ లేడు..ముందు స్పీకర్ ఎన్నిక కావాలి..ఆ స్పీకర్ బిజెపివాడే  అవుతాడు..తర్వాత అనర్హత వేటు వేయాలి..అది వేయడు..వేసినా కోర్టుకి వెళ్తుంది..కోర్టుకు వెళ్లినా..కోర్టేం చెప్తుంది..ముందు హైకోర్టుకి పోండంటూ చీదరిస్తుంది..తర్వాత కోర్టులేం చెప్తాయ్..స్పీకర్ డెసిషనే ఫైనల్ అంటుంది..

మరి స్పీకర్ వీళ్లపై వేటెందుకు వేస్తాడు..? రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు వేసారా..?
కర్నాటకలో స్పీకర్ కాంగ్రెస్సాయన కాబట్టి అనర్హత వేటు వేసాడు..ఐనా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూశారుగా...రైటే..మీరు స్పీకర్ కాబట్టి..డిస్ క్వాలిఫై చేసారు రైటే...కానీ..ఎలక్షన్లలో పోటీ చేయవద్దనే  రైట్ మీకెక్కడ ఉందంటూ లా పాయింట్ తీసింది..ఇంకేముంది ఏ ఎమ్మెల్యే ఎవడికి ఇష్టం వచ్చినట్లు ఓటేయవచ్చు..పదవి పోతే బై ఎలక్షన్లలో పోటీ చేయవచ్చు..తిరిగి గెలవవచ్చు..కాకపోతే కాస్త ఖర్చవుతుందంతే...కానీ ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడానికి పార్టీలు రెడీగా ఉన్నప్పుడు ఇక ఈ భయాలెందుకు..అయినా ఆ మాత్రం ఆలోచించకుండానే విప్ పక్కనబెట్టి అవతలి పార్టీకి ఓటేస్తారా ఏంటి..

అయ్యా శరద్ పవార్ గారూ..ఇక మహారాష్ట్ర పీఠం మీది కాదు..దయచేసి ఆశలు వదులుకోండి..కాంగ్రెస్ ఎప్పుడో వదిలేసుకుంది..శివసేన అంటారా..బెటర్ లక్ నెక్ట్స్ టైమ్

Comments

  1. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఇక ఈయన ఎప్పటిలాగే టీవీ చూస్తూ కూర్చోవచ్చు!

    ReplyDelete
  2. శరద్ పవార్ కూడా సింహం గుర్తుతో వేరే పార్టీ పెట్టుకోవాల్సిందేనా? చూడాలి ఇవాళ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో!

    ReplyDelete

Post a Comment