స్ట్రైక్ ఆగింది..జనంపై సర్జికల్ స్ట్రైక్ మొదలైంది


55 రోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రయ్ రయ్ మని పరుగులు పెడుతున్నాయ్...హుషారుగా ఒకటి రెండు జర్క్ లు కూడా ఇవ్వొచ్చు..ఈ మధ్యకాలంలో  ఏం జరిగిందీ అందరికీ తెలుసు...అటు వాళ్లకి లాభం వచ్చింది లేదు..ఇటు గవర్నమెంట్ ఆర్టీసీని ఏదో చేస్తుందన్న బిల్డప్ నిజమైందీ లేదు...కానీ..మధ్యలో జనమే సచ్చారు..

ఆ మాటకి వస్తే ఆర్టీసీ ఎంప్లాయిలు 33మంది చనిపోయారు..ఇంకా ఎక్కువ కావచ్చు..తక్కువ  ఉండొచ్చు..కానీ ఈ ఇగోల సమ్మెతో బలైంది 33 కుటుంబాలు...మనిషి చనిపోతే..ఆ లోటుని పూడ్చడం దేవుడి తరం కూడా కాదు..డబ్బుదేముంది..ప్రకటి్స్తారు..ఉద్యోగాలు కూడా...కానీ తండ్రిని కోల్పోయిన పసిబిడ్డల మూగ రోదన..వాళ్ల మనసులోని దిగులు..ఎవ్వరూ అర్ధం చేసుకోలేరు..అది ఎంత వేదనో అర్ధం చేసుకోవడం అసాధ్యం..ఎవరికైనా ఆ అనుభవం ఎదురైతేనే తెలుస్తుంది..పెద్దవాళ్లకంటే కొ్న్నాళ్లపాటు దిగులు..తర్వాత కాలంగాడిలో పడిపోతారు..కానీ చుట్టుపక్కల అందరికీ తండ్రి కన్పిస్తూ..తనకి మాత్రం తండ్రో తల్లో లేకపోతే..అది ఎలా ఉంటుంది..ఓసారి మీరే లేకుండా పోతే..మీ బిడ్డలు ఎలా అల్లాడిపోతారో ఒక్కసారి ఊహించుకోండి...మరి అంతమందిని కోల్పోయిన ఆ 33 కుటుంబాలు ఏం కావాలి..ఆసరాగా  ఇచ్చే మీ ఉద్యోగాలు ఇప్పుడెందుకు..బతికి ఉన్నప్పుడే ఓ మెట్టు దిగితే సస్తారా...కాదు కదా..
ఇది ఆ కుటుంబాల బాధ కదా...ఇక ఇప్పుడు జీవచ్చవాల్లాగా ఆర్టీసీ బస్సులలో( ఓ సారి జర్నీ చేసి చూడండి) తిరిగి జనంపై పిడుగు పడింది.కిలోమీటర్ కి ఏకంగా 20 పైసలు..అంటే  పది కిలోమీటర్లకి 2 రూపాయలు...50 కిలోమీటర్లకి 10 రూపాయలు పెరుగుతుంది..(ఇది గవర్నమెంట్ చెప్పిన లెక్కే) ఏకంగా 25శాతం పెరిగినట్లు..అంటే స్ట్రైక్ నడుస్తున్నప్పుడూ జనాలకే తిప్పలు...స్ట్రైక్ ఆపినా...మాకేనా తిప్పలు..ఏం రాజ్యం గురూ ఇది..నెమ్మదిగా కాళ్లకి పని చెప్పడం మంచిదా..ఆరోగ్యానికి ఆరోగ్యం..డబ్బులకు డబ్బులు మిగులుతాయి..

Comments