ఆమెతో పాటు వాళ్లూ చచ్చిపోవాలి..అప్పుడే మా రేటింగ్స్ పెరిగేది

ఔను...ఈ ఇష్యూ ఎంత పెద్దది అయితే అంత బావుంటుంది..అసలే మా ఛానల్ రేటింగ్ ఈ మధ్య బాగా పడిపోయిందని ఒకడు.
.ఆహా..ఈ నలుగురిని కూడా ఎన్ కౌంటర్ చేస్తే...నా ఛానల్ ని డిస్కషన్స్ పెట్టి పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ..పైకీ తీసుకపోతా అని ఒకడు..
ఎహా...చూడండి నేనెలా కంటిన్యూస్ గా కవరేజీ ఇస్తున్నానో..మన రిపోర్టర్లని పోలీసులు...ఆ అభాగ్యురాలి బంధువులు..తల్లిదండ్రులు తిట్టుకున్నాసరే..చివరికి కొట్టినా సరే పట్టించుకోవద్దు..మీరేమంటారు...మీరేమనుకుంటన్నారు అని వెంటబడమని చెప్పండి..డోన్ట్ కేర్..మనకి రేటింగే ముఖ్యం...ఎక్కడికో పోవాలి రేటింగ్స్ ఈ వారం..అని ఒకడు..
ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు కవరేజీలో మాట్లాడుతూ..రొప్పుతూ రోగుతూ..సోలిపోయారే తప్ప నిజంగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి..?

ఎవడైనా ఆలోచించాడా...లాయర్లు వారి తరపున వాదించరని చెప్పారు..నెక్ట్సేం జరుగుతుంది...రిమాండ్, కస్టడీ..తర్వాత విచారణ...ఇదేగా..దీనికంటే గప్ చిప్ గా ఉన్నట్లైతే..ఎక్కడ ఏం జరుగుతుందీ క్లియర్ గా చెప్పకుండా ఉన్నట్లైతే..పోలీసులే న్యాయం చేసేవాళ్లు..కానీ ఇదిగో ఇక్కడే పిశాచాలను పెట్టింది..ఇదిగో ఇక్కడ్నుంచే తీసుకెళ్లబోతోంది..ఇదిగో ఈ రూట్లోనే వాళ్లని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అని జాతిహితం కోసం లైవ్ ఇవ్వబట్టే కదా..ఎవడూ ఓం చేయలేకపోయాడు.-.ఇదో వాదన..బయలుదేరింది ఇప్పుడు..నిజమేగా ఈ వాదనలో 80శాతం వాస్తవం కన్పిస్తుంది..

అంతెందుకు..ఆ మారుతీరావ్ ఉన్నాడే..వాడు కూతురు అమృతని బెదిరిస్తున్నాడంటే ఇంతవరకూ ఎవరూ ఆ ఛాయలకే పోలేదు..ఎందుకో తెలుసా..అది పాత న్యూస్..ఇప్పుడు శంషాబాద్ ది కొత్త న్యూస్..దీనికే రేటింగ్ ఎక్కువ..అందుకే ఇదే వేస్తాం అంటున్నారు..ఓ వేళ  ఈ న్యూసూ పాతబడితే..అప్పుడు మారుతిరావ్..ప్రణయ్ అమృతని మళ్లీ బెదిరిస్తున్నాడా అంటూ బయలుదేరతారేమో....


Comments