అధాటుగా చూసేసరికి..మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అయ్యాకే భలే యాక్టివ్గా అయినట్లున్నాడే అన్పించింది..కాసేపటికి కానీ అర్ధం కాలేదు..ఆయన మన్మోహన్ కాదు...మోదీ అని..అచ్చంగా సింగులాగా తయారైపోయి..పంజాబ్ పోయి..అక్కడ కర్తార్ పూర్ కారిడర్ ఓపెనింగ్ చేసి వచ్చేసిన ఈ మోదీని చూస్తే ఒకటనిపించకతప్పదు..గురూ నీకిన్ని ఐడియాలేంటని..ఇప్పుడుక్కడ ఎన్నికలు లేవు..పైగా అయోద్య తీర్పు కూడా వచ్చేసింది..ఐనా ఫంక్షన్ కి తగ్గట్లుగా తయారవడంలో నిన్ను మించినోళ్లు లేరు గురువా...
పైగా ఆ తలపాగా..గడ్డం కూడా భలేగా సెట్ అయిందిలే...పైన ఫోటో చూడండి..మన్మోహన్ తో మోడీ కలిసి ఎలా ఉన్నాడో..అసలు ఓ ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరికైనా ఇలా నమస్కారం చేయడం ఎప్పుడైనా చూసారా....సరదా...ఆత్మీయత..రెండూ కలగలిపి లేవూ...
అచ్చమైన పఠాన్ లాగా...సిక్కులాగా వాళ్ల మధ్యలో కూర్చున్న ఈయన ప్రధానమంత్రి అంటే వెంటనే నమ్మరేమో..కానీ నమ్మకతప్పదు..మామూలుగా అయితే..ఇలాంటి వేషధారణలు వేస్తుంటే..మరి..స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ కి వెళ్తే స్విమ్ సూట్ వేస్కుంటారా ఏంటి అంటుంటా...కానీ ఈయన్ని చూస్తే మాత్రం ఆ పని కూడా చేస్తాడేమో అన్పిస్తోంది..మామూలోడు కాదు సామీ
// "అచ్చమైన పఠాన్ లాగా...సిక్కులాగా" //
ReplyDeleteపఠాన్లు వేరండి, సిక్కులు వేరండి.
నేను రెండూ ఒకటనలేదండి
ReplyDeleteOkatanaledu again, inthaki aayana attire - pathana , sikka?
Delete