మహా గేమ్..వాళ్లూ వీళ్లూ ఎందుకబ్బా..గవర్నర్‌నే సిఎం చేయండి





మహారాష్ట్ర రాజకీయం భలే రంజుగా మారింది..ఇప్పటిదాకా బిజెపి కాకపోతే..శివసేనకి అనుకుంటే..గవర్నర్ కోష్యారి ఏకంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమంటూ ఆహ్వానించారు. ఎన్‌సిపి కూడా రాజ్‌భవన్‌కి తరలింది. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో రాజకీయకాక రగిలింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి అసెంబ్లీని రాష్ట్రపతిపాలన దిశగా నడిపిస్తున్నారని అంచనాలు ప్రారంభం అయ్యాయ్.

 బిజెపి..తర్వాత శివసేన..ఆ తర్వాత ఎన్‌సిపి ఇలా అన్ని పార్టీలను వాటి సంఖ్యాబలాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు..వీటిలో బిజెపి ఓపెన్‌గానే తన నిస్సహాయత వెల్లడించగా...శివసేన మాత్రం  ఇతర పార్టీల మద్దతుతో పీఠం దక్కించుకుంటుందనుకుంటే.. కాంగ్రెస్ నాన్చుడు ధోరణితో ఆ ఆశ కాస్తా ఆవిరయ్యింది. అటు శరద్ పవార్ కూడా ఏ మాటా బైటికి చెప్పలేదు.. దీంతో గవర్నర్‌ని కలిసిన  ఆదిత్య థాక్రే ప్రభుత్వం ఏర్పాటుపై సామీ మేం రెడీ అన్నా ...గవర్నర్ పట్టించుకోలేదు..48 గంటల గడువు కోరినా..నో నో అన్నాట్ట

దాంతో పాటే శరద్ పవార్ టీమ్‌ని సర్కారేర్పాటు చేసుకోమంటూ కాల్ ఇచ్చాడు..దీంతో బంతి ఎన్‌సిపి కోర్టులో పడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది..ఎన్‌సిపి ఏదైనా మ్యాజిక్ చేయగలుగుతుందా..లేక శివసేనలానే గడువు కోరుతుందా..ఇదే అసలు ప్రశ్న..ఓ వేళ ఎన్‌సిపి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని చేతులు ఎత్తేస్తే.. ఇక కాంగ్రెస్‌ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి.. ఆ తర్వాత
స్ట్రాటజీ ప్రకారం రాష్ట్రపతి పాలన అంటాడా గవర్నర్..ఇంతెందుకు ప్రభూ నువ్వే సిఎం కాకూడదా

Comments