గచ్చిబౌలిలో కారు యాక్సిడెంట్ చేసినవారిపై కేసు లేదా..చేసిందెవరు నష్టపరిహారం ఇస్తే చాలా



కారు యాక్సిడెంట్  అయింది..అన్యాయంగా ఓ ప్రాణం బలైంది..అసలు ఓవర్ స్పీడ్ కాదు..ఆ ఫ్లై ఓవర్ నిర్మాణమే పరమ దరిద్రం...రోడ్ పై నుంచి కింద పడకుండా అడ్డుకునే పిల్లర్ హైట్ చాలా తక్కువ..అలానే బ్రిడ్జ్ పై వెళ్తుంటే..ప్రతి వెహికలూ..ఎత్తెత్తి పడుతూ...ప్యాంట్ తడుపుకునేలా చేస్తుంది..కావాలంటే తర్వాతైనా ఎవరైనా జర్నీ చేసి చూడండి

ఆ ఫ్లైఓవర్ పైన ఆటోలోనో...క్యాబ్ లోనూ వెళ్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే..పైగా అర్ధం పర్ధంలేని మలుపులు ఒకటి..అందులో వంద కిలోమీటర్ల స్పీడ్ అనేది మరీ కంట్రోల్ చేయలేనంత స్పీడేం కాదు..అయినంత మాత్రాన స్పీడ్ గా వెళ్లమని కాదు..అసలు ఆ ప్లైఓవర్ పై మాత్రం వెళ్తే...వళ్లు దగ్గరపెట్టుకుని వెళ్లాల్సిందే..అదొక్కటే కాదు..టోలి చౌకి ఫ్లైఓవర్ కూడా అదే పరిస్థితి..

ఇక జూబ్లిహిల్స్ లో ఉండే వ్యక్తిని కారు డ్రైవర్ గా చెప్పడమేంటి..వెంటనే నష్టపరిహారం ప్రకటించారు కానీ..అంత స్పీడుగా వెళ్తున్నందుకు కేసు పెట్టరా..పైగా అతగాడు ఎలా ఉన్నాడో ఎందుకు చెప్పడం లేదు..సాధారణమైన ప్రశ్న..ఎందుకంటే హీరో రాజశేఖర్ కే మొన్నామధ్య చలానాలు వేశారు కదా..

Comments

  1. Road rages should be severely punished. Before issuing licence the applicants should be given mandatory counselling of driving ethics followed by videos of road accidents for half day.
    ఇప్పుడు వాహనచోదకులు mindset - నేను ముందు వెళ్లిపోవాలి నాకు ఎవరూ అడ్డు రాకూడదు. - there is no traffic sense or civic sense. Indiscriminate honking of horns. పొగరు, lack of respect for co users of road.
    Massive education campaign should take place.

    The biodiversity flyover design seems to be flawed.

    Nowadays it is virtually hell on Hyderabad roads.

    ReplyDelete
    Replies
    1. ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి వివరాలు కాస్త ఆలస్యంగా ఇవాళ వార్తల్లో వచ్చింది.
      వంద కిలోమీటర్ల వేగంతో నగరంలో ప్రయాణమా! అసలు బుద్ధి ఉందా ఆ సన్నాసికి?

      Delete

Post a Comment